బిజినెస్

భయపెడుతున్న కరెంట్ అకౌంట్ లోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: రూపాయలు మారకపు విలువను పెంచడానికి, బ్యాంకులపై నమ్మకాన్ని కల్పించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బీఐ) తీసుకుంటున్న చర్యలు చెప్పుకోదగ్గ ఫలితాలను ఇవ్వడం లేదు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెరగాలంటే ఎగుమతుల్లో పెరుగుదల అత్యవసరం. ఈ దిశగానే ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పలు ప్రతిపాదనలు చేశారు. ప్రణాళికలను రూపొందించారు. కానీ, పరిస్థితిలో చెప్పుకోదగ్గ మార్పు లేదని పెరుగుతున్న కరెంట్ అకౌంట్ లోటు స్పష్టం చేస్తున్నది. ఒక నిర్ణీత సమయంలో జరిగిన ఎగుమతుల కంటే, దిగుమతుల విలువ ఎక్కువగా ఉంటే, ఆ వ్యత్యాసాన్ని కరెంట్ అకౌంట్ లోటుగా పేర్కొంటారు. 2016-17 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంగా ఎగుమతుల కంటే దిగమతులు విలువ కేవలం 0.1 శాతం ఎక్కువగా నమోదైంది. ద్వితీయ త్రైమాసికంలో 0.6, తృతీయ త్రైమాసికంలో 1.4, చివరి త్రైమాసికంలో 0.6 శాతంగా తేలింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏకంగా 2.5 శాతం తేడా నమోదైంది. ఆతర్వాత ద్వితీయ, తృతీయ త్రైమాసికాల్లో 1.2 శాతం, 2.00 శాతంగా తేలింది. చివరి త్రైమాసికంలో ఈ లోటు 1.9 శాతం. అయితే, గత ఆర్థిక సంవత్సరం మొదతి ట్రైమాసికం మాదిరిగానే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం కూడా భారీ లోటుతో మొదలైంది. 2.4 కరెంట్ అకౌంట్ లోటు సహజంగానే అటు మదుపరులను, ఇటు ఆర్‌బీఐనీ వేధిస్తుంది. సాధారణంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దిగుమతులు తక్కువగా, ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాల్లోనే కరెంట్ అకౌంట్ లోటు కనిపిస్తుంది. కానీ, అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరకపోయినప్పటికీ, భారత్‌లో లోటు పెరగడం విచిత్రం. రూపాయి విలువ పతనమే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఇలావుంటే, గత ఆర్థిక సంవత్సరం ప్రా రంభంలో ఇదే మాదిరి లోటు భారీగా నమోదైన ప్పటికీ ఆతర్వాత క్రమంగా కుదుటపడింది. ఈసా రి కూడా అలాంటి అవకాశాలు లేకపోలేదని నిపు ణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఎగు మతులను పెంచేందుకు కేంద్రం పలు చర్యలు తీ సుకుంటున్నది. ప్రోత్సాహకాలను అందిస్తున్నది. ఈ చర్యలు కూడా కరెంట్ అకౌంట్ లోటును త గ్గించడానికి ఉపయోగపడతాయ. ప్రస్తుత పరిస్థి తి మాత్రం ఆందోళనకరంగానే ఉంది.