బిజినెస్

నీరవ్ మోదీ సోదరికి రెడ్‌కార్నర్ నోటీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)కి వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరి పుర్వి దీపక్ మోదీకి ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలపై ఆమెకు అంతర్జాతీయ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ విషయాన్ని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. 44 ఏళ్ల పుర్వి దీపక్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా 133 మిలియన్ డాలర్లు (950 కోట్ల రూపాయ
లకు పైగా) లబ్ధి పొందడంతోపాటు కుంభకోణంలో కీలకపాత్ర పోషించిందన్న ఆరోపణలపైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ ఆధ్వర్యంలో సెంట్రల ఏజన్సీ ఈ కేసును విచారిస్తున్నాయి. పుర్వి మోదీ తన సోదరుడు నీరవ్ మోదీతో కలసి అమెరికా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాల్లోని వివిధ సంస్థలకు యజమాని, డైరెక్టర్‌గా వ్యవహరించడంతోపాటు పెట్టుబడులు పెట్టింది. ఈ కేసు దర్యాప్తును మరింత ముందుకు తీసుకువెళ్లడానికి వీలుగా ఆమె సహకరించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ భావిస్తోంది. ఇప్పటికే పలు సమన్లు జారీచేసినప్పటికీ వాటిని పట్టించుకోకపోవడంతో ఆమెపై గ్లోబల్ వారంట్ జారీ చేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేసింది.