బిజినెస్

పది నెలల కనిష్టానికి చిల్లర ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: దేశంలో చిల్లర ద్రవ్యోల్బణం ఆగస్టు నెలలో పది నెలల కనిష్ట స్థాయి 3.69 శాతానికి తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) విధించిన గరిష్ట పరిమితి నాలుగు శాతం కన్నా తక్కువగానే నమోదయింది. పళ్లు, కూరగాయలు, ఇతర ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో వినియోగ వస్తువుల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గిందని బుధవారం వెలువడిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఒకవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో చిల్లర ద్రవ్యోల్బణం తగ్గిన గణాంకాలు వెలువడ్డాయి. ఆగస్టు 16వ తేదీ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే, సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం (చిల్లర ద్రవ్యోల్బణం) 2017 జూలైలో 4.17 శాతం, ఆగస్టులో 3.28 శాతం ఉండింది. 2017 అక్టోబర్‌లో 3.58 శాతం ఉండింది. అప్పటి నుంచి ఆర్‌బీఐ విధించిన పరిమితి నాలుగు శాతం కన్నా పైనే నమోదవుతూ వచ్చింది.