బిజినెస్

పురుషుల సౌందర్య సాధనాలతో డబ్బే డబ్బు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: సౌందర్య సాధనాలు కేవలం మహిళలకే అనుకునే రోజులు పోయాయి. పురుషులకు కూడా అందంగా కనిపించాలన్న తాపత్రయం పెరుగుతున్నది. అందుకే, పురుషుల కోసం ప్రత్యేకంగా సౌందర్య సాధనాలను తయారు చేస్తున్న కంపెనీలు భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయి. వినియోగ వస్తువుల తయారీలో పేరెన్నిక గల గాడ్రెజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (జీసీపీఎల్) ఈ రంగంలో ముందుకు దూసుకెళుతున్నది. కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నది. పురుషుల సౌందర్య సాధనాలకు దేశంలో భారీ మార్కెట్ ఉందని, దానిని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధి సునీల్ కటారియా మంగళవారం పీటీఐతో మాట్లాడుతూ చెప్పారు. పురుషులకు ప్రత్యేకించిన సౌందర్య సాధనాల అమ్మకాల్లో టైర్ 1, 2, 3 మార్కెట్లను కొల్లగొడతామని దీమా వ్యక్తం చేశారు. వచ్చే రెండుమూడు సంవత్సరాల్లో ఈ రంగంలోనే కనీసం 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. గాడ్రెజ్ కంపెనీ తన సింథాల్ బ్రాండ్ కింద దేశంలో 5,500 కోట్ల రూపాయలకు మార్కెట్‌ను విస్తరించుకుంది. సింథాల్ ఒక్కటే 750 కోట్ల రూపాయల విలువైన బ్రాండ్. ఇటీవల కాలంలో క్షవరశాలల సెగ్మెంట్‌లోకీ అడుగుపెట్టింది. సోషల్ మీడి యా, ఈ-కామర్స్ ద్వారా అమ్మకాలను గణనీయంగా పెంచుకోవచ్చని గాడ్రెజ్ ప్రత్యక్షంగా రుజువు చేసింది. మార్కెట్‌లో ఇదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తే, రెండేళ్లలోనే 100 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని అందుకోవడం ఆ కంపెనీకి అసాధ్యమేమీ కాదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.