బిజినెస్

సెనె్సక్స్ మరింత పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 18: ముంబయి స్టాక్ ఎక్ఛ్సేంజ్ సెనె్సక్స్ పాయింట్లు మంగళవారం మరింత పతనమయ్యాయి. సోమవారం సుమారు 500 పాయింట్ల పతనమైన సెనె్సక్స్ మంగళవారం కూడా దాదాపుగా అదే బాటలో పయనించింది. తగ్గుదల ఆ స్థాయిలో లేకపోయినప్పటికీ, వరుసగా రెండో రోజు కూడా లావాదేవీల్లో పురోగతి కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ వారం మొదటి రోజే 505.13 పాయింట్ల కోల్పోయిన సెనె్సక్స్ మంగళవారం మరో 294.84 పాయింట్లు చేజార్చుకొని 37,290.67 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా, అమెరికా వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకోవడానికి రూపాయి పతనం కూడా తోడుకావడంతో, సెనె్సక్స్ పుంజుకోలేకపోతున్నది. హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్, ఎస్ బ్యాంక్, విప్రో, ఓఎన్‌జీసీ, ఐటీసీ కంపెనీల షేర్లు మెరుగుపడితే, ఎస్‌బీఐ, టాటా మోటర్స్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్ నష్టాలను చవిచూశాయి. సోమవారంతో పోలిస్తే కొంత తగ్గినప్పటికీ, మంగళవారం కూడా నిఫ్టీ స్వల్పంగా తగ్గింది.
98.85 పాయింట్లు తగ్గి, 11,278.90 పాయింట్ల వద్ద ముగిసింది. హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్, ఎస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, రెడ్డీ లాబ్స్, ఐటీసీ లాభపడగా, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్, టాటా మోటర్స్, హెచ్‌పీసీఎల్, బజాజ్ ఆటో నష్టపోయాయి.
చైనాపై అమెరికా కొరడా
చైనాపై అమెరికా మరోసారి విరుచుకపడింది. తమ దేశంలోకి దిగుమతి అవుతున్న చైనా ఉత్పత్తులపై సుంకాన్ని మరోసారి పెంచింది. గతంలో అమెరికా పన్నులను పెంచిన ప్రతిసారీ చైనా కూడా ఎదురుదాడికి దిగి, తాను కూడా దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికా పన్నుల వడ్డనకు దిగడంతో, చైనా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.