బిజినెస్

తిరిగి బలపడిన రూపాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 19: రూపాయి విలువ బుధవారం తిరిగి బలంగా పుంజుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 61 పైసలు పెరిగి 72.37 వద్ద ముగిసింది. బుధవారం ఇక్కడి ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ (్ఫరెక్స్) మార్కెట్‌లో పౌండ్ స్టెర్లింగ్‌తో రూపాయి మారకం విలువ కూడా పెరిగి, 95.07 వద్ద ముగిసింది. ఫోరెక్స్ మార్కెట్‌లో బుధవారం సెషన్ అంతా రూపాయి కదలిక సానుకూల ధోరణిలోనే సాగింది. ఉదయం లావాదేవీలలోనే డాలర్‌తో రూపాయి మారకం విలువ తన జీవనకాల కనిష్ట స్థాయి నుంచి 28 పైసలు పుంజుకొని, 72.70 వద్దకు చేరింది. ఎగుమతిదారులు, బ్యాంకులు తాజాగా జరిపిన డాలర్ల విక్రయాలతో రూపాయి బలపడుతూ వచ్చింది. అదే ధోరణి కొనసాగిస్తూ లావాదేవీలు ముగిసే సమయానికి మరింత బలపడింది. మొత్తం మీద క్రితం సెషన్ ముగింపుతో పోలిస్తే 61 పైసలు పుంజుకుంది. ఎగుమతిదారులు, బ్యాంకులు అమెరికన్ డాలర్లను విక్రయించడంతో పాటు, విదేశీ కరెన్సీలతో మారకంలో అమెరికన్ డాలర్ బలహీనపడటం కూడా రూపాయి మారకం విలువ పెరగడానికి దోహదపడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం అధిక స్థాయిల వద్ద ప్రారంభం కావడం కూడా రూపాయి మారకం విలువ పెరగడానికి తోడ్పడిందని ఫోరెక్స్ డీలర్లు తెలిపారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం ఇంట్రా-డేలో 47 పైసలు పడిపోయి, ఆల్ టైమ్ లో 72.99 వద్దకు దిగజారింది.