బిజినెస్

భారత్‌తో పారదర్శక వాణిజ్యాన్ని కోరుకుంటున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, సెప్టెంబర్ 19: భారత్‌తో తమ వాణిజ్య వ్యవహారంలో సమానావకాశాలు, నిష్పక్షపాతమైన వాతావరణాన్ని కోరుకుంటున్నామని చైనా దేశం అసంతృప్తి వ్యక్తం చేసింది. 5జి టెక్నాలజీ విషయంలో చైనా కంపెనీలను హువాయ్ టెక్నాలజీస్, జడ్‌టిఇ కార్పొరేషన్ సంస్థలు భారత్ కంపెనీలతో పనిచేయకుండా అనుమతి నిరాకరించిందని చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. 5జి టెక్నాలజీలో ప్రవేశపెట్టడంలో భారత్‌లో పలుదేశాలు భాగస్వాములవుతున్నాయని, ఈ నేపథ్యంలో చైనాకు చెందిన ఈ రెండు కంపెనీలు కూడా వెళ్లగా రక్షణపరమైన కారణాలతో వీటికి అనుమతి నిరాకరించారని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. కాగా, 5జి టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన సాంకేతిక సహకారం పరస్పరం పంచుకునే నిమిత్తం ఎరిక్‌సన్, నోకియా, శాంసంగ్, సిస్కో, ఎన్‌ఇసి సంస్థలను డాట్ ఆహ్వానించగా, దానికి అవి సమ్మతిని తెలియజేశాయని గత వారం టెలికాం సెక్రటరీ అరుణ సుందరరాజన్ తెలిపారు. ఇందులో భాగస్వాములు కాదలచిన కంపెనీలు ఏవైనా దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. కాగా, దీనిపై చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జెంగ్ షాంగ్ మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఉన్న చట్టాలు, నిబంధనల మేరకు తాము విదేశాలతో వ్యాపారం నిర్వహిస్తున్నామని అన్నారు. తాము అన్ని దేశాలతో వాణిజ్య సహకారాన్ని పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. భారత్-చైననా మధ్య సహకారం ఉంటే ఇరుదేశాలు అభివృద్ధిని సాధిస్తాయని, మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. మిగిలిన రంగాలలాగే టెలికాంలో కూడా భారత్‌తో సహకారాన్ని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు.