బిజినెస్

భారత్‌లో పెట్టుబడులకు ముందుకు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుచారెస్ట్ (రుమేనియా), సెప్టెంబర్ 20: భారత్ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేసిందని, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఉపరాష్టప్రతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. రుమేనియాలోని బుచారెస్ట్‌లో వాణిజ్య వేత్తల సమావేశంలో ప్రసంగించారు. భారత్-రుమేనియా మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉపరాష్టప్రతి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 810 మిలియన్ డాలర్లకు చేరుకుందన్నారు. ఈ సమావేశం వివరాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రావేష్ కుమార్ వెల్లడించారు. భారతదశంలో ఆర్థికాభివృద్ధి వేగంగా కొనసాగుతోందని, మంచి పెట్టుబడులకు మంచి అవకాశమని ఉపరాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్థిక రంగంలో ఉభయ దేశాలు పరస్పరం సహకరించుకోవాలన్నారు. రుమేనియాలో యోగాకు పాపులారిటీ పెరగడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆయుర్వేద వైద్యానికి ఆదరణ పెరిగిందన్నారు. ఆయూష్ సమాచార సెల్‌ను ప్రారంభించిన వెంకయ్యనాయుడు, ఈ సందర్భంగా ఆయుర్వేదంపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. సెక్యూరిటీ కౌన్సిల్‌లో భారత్‌కు స్థానం లభించాలని రుమేనియా కోరడాన్ని ఆయన స్వాగతించారు. ఈ సందర్భంగా రుమేనియా అధ్యక్షుడు క్లాస్ వెర్నర్ లోహనీస్, ప్రధానమంత్రి విరోసియా డాన్సిలా మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య సంబంధాలు పటిష్టం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనల సమాచారాన్ని పంచుకోవాలన్నారు.