బిజినెస్

చమురు ధరలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ముడి చమురు ధరల్లో కదలికలు, దేశీయ రాజకీయాల క్రియాశీలత, ప్రపంచ వడ్డీ రేట్లు, అంతర్జాతీయ వాణిజ్య రంగంలో పరిణామాలు సమీప భవిష్యత్తులో దేశీయ స్టాక్ మార్కెట్ల ధోరణిని నిర్దేశించనున్నాయి. రూపాయి విలువ పతనం, అధిక ముడి చమురు ధరలు, దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ నిధులు ఎడతెరిపి లేకుండా తరలిపోతుండటం, అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య వివాద ఉద్రిక్తతలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఈ ఏడాది చివరలో కొన్ని కీలక రాష్ట్రాలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కూడా మదుపరులు దృష్టి కేంద్రీకరిస్తారని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. భారత స్థూలార్థిక పరిస్థితులు దిగజారడానికి కారణమవుతున్న రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పతనం కావడం, బాండ్ ఆదాయాలు పెరగడం, ముడి చమురు ధరల పెరుగుదల వంటి అనేక ప్రతికూల అంశాలను భారత స్టాక్ మార్కెట్లు ఎదుర్కొంటున్నాయని సెంట్రమ్ బ్రోకింగ్ రీసెర్చ్ (వెల్త్) విభాగం అధిపతి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జగన్నాథం తునుగుంట్ల పేర్కొన్నారు. ‘కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తరువాత 2019- లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న ఈ పరిస్థితుల్లో మార్కెట్లలో అనిశ్చితి కూడా పెరుగుతుంది. ఈ అంశాలన్నీ దేశీయ స్టాక్ మార్కెట్ల ఎదుగుదలను నిరోధిస్తాయి’ అని తునుగుంట్ల పేర్కొన్నారు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఈ సంవత్సరం ఇప్పటి వరకు తొమ్మిది శాతం పుంజుకుంది. ప్రస్తుతం 37,121 పాయింట్ల స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. ‘వివిధ సెగ్మెంట్లలో డిమాండ్ పెరుగుదల వల్ల కార్పొరేట్ కంపెనీల లాభాలు పుంజుకోవడం ప్రధానంగా దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాలకు దోహదపడింది. ప్రపంచ పరిణామాలను పరిశీలిస్తే, వాణిజ్య యుద్ధ సంబంధిత ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు తగ్గితే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు ఆర్జిస్తాయి’ అని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ టీనా విర్మాని పేర్కొన్నారు. ‘ప్రపంచ వడ్డీ రేట్లు, దిగుమతి సుంకాల పెంపుదల వల్ల తలెత్తిన అంతర్జాతీయ వాణిజ్య వివాదాలు, కరెన్సీ విలువలో మార్పులు, ద్రవ్యోల్బణం అంచనాలు, దేశీయంగా రాజకీయ క్రియాశీలత వంటి అంశాలు స్టాక్ మార్కెట్లను కీలకంగా ప్రభావితం చేస్తాయి’ అని సామ్‌కో సెక్యూరిటీస్ అండ్ స్టాక్‌నోట్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) జిమీత్ మోదీ పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ సునిశితంగా గమనించనున్న అంశాలలో త్వరలో జరుగబోయే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమయినవిగా ఉంటాయి.