బిజినెస్

7.8 శాతానికి తగ్గదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాను ఫిచ్ రేటింగ్స్ 7.8 శాతానికి పెంచింది. ఈ వృద్ధి రేటు 7.4 శాతం ఉంటుందని గతంలో అంచనా వేసింది. అయితే, భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుకు ఆర్థిక పరిస్థితులు జటిలం కావడం, చమురు కొనుగోలు వ్యయం పెరగడం, బలహీనంగా ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లు ప్రతికూలంగా నిలుస్తున్నాయని ఫిచ్ ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై చేసిన అధ్యయన నివేదికలో పేర్కొంది. ‘2018-19 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఉత్పాదన ముందు అంచనా వేసిన దానికన్నా మెరుగ్గా ఉండటం వల్ల 2018-19 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాను గతంలో పేర్కొన్న 7.4 శాతం నుంచి 7.8 శాతానికి పెంచాం’ అని ఫిచ్ పేర్కొంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మొత్తం ఆసియా దేశాల కరెన్సీలతో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి విలువ ఎక్కువగా దెబ్బతిన్నది. రూపాయి విలువ పతనం, అధిక డిమాండ్ ఒత్తిడిల కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నిర్దేశించిన లక్ష్యం (4శాతం, ప్లస్ మైనస్ 2శాతం)లో పైభాగానికి చేరుకుంటుందని కూడా ఫిచ్ అంచనా వేసింది. భారత్‌లో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పెరుగుదల 2018-19 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఫిచ్ గతంలో అంచనా వేసిన 7.7 శాతానికి మించి 8.2 శాతంతో వృద్ధి చెందడం వల్ల మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును ఫిచ్ పెంచింది. 2017-18 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది.