బిజినెస్

భారత్ వస్తే నన్ను చంపేస్తారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 21: తనపై ఉన్న నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను రద్దు చేయాలని పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో సహ నిందితునిగా ఉన్న వజ్రాల వ్యాపారి మెహల్ ఛోక్సీ శుక్రవారం సీబీఐ కోర్టును ఆశ్రయించారు. భారత్‌కు వస్తే తనకు ప్రాణహాని ఉందని ఆయన విన్నవించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 12,636 కోట్ల మోసానికి సంబంధించి సీబీఐ మే 22న రెండో చార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రత్యేక కోర్టు ఛోక్సీపై నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేయగా, ఛోక్సీ తన లాయర్ సంజన్ అబ్బాట్ ద్వారా శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన తాను భారత్ రాకపోవడానికి గల కారణాలు వివరించారు. ఇటీవల జాతీయస్థాయి టెలివిజన్ చానల్‌లో జరిగిన ఒక చర్చా కార్యక్రమం తనను తీవ్ర షాక్‌కు గురిచేసిందని ఛోక్సీ చెప్పారు. బ్యాంకుల్లో జరుగుతున్న మోసాలపై జరిగిన చర్చలో ఇద్దరు కాలర్స్ ఫోన్‌లో తమ అభిప్రాయలు పంచుకున్నారు. ‘్ఛక్సీ కనుక భారత్ వస్తే ఒక ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి అతను ఎక్కడున్నా కాల్చి చంపేయాలి, ఇలాంటి మోసం భవిష్యత్‌లో ఎవరు చేయాలన్నా భయపడాలి’ అని ఆ ఇద్దరు కాలర్స్ అభిప్రాయపడ్డారు. దానిని యాంకర్ సైతం ఖండించలేదు, పైగా వారి వ్యాఖ్యలకు నవ్వింది. ఆ చర్చలో పాల్గొన్న మిగిలిన వ్యక్తులు సైతం దీనికి అనుకూలంగానే వ్యవహరించారు. దీనిని చూస్తే తనకు భారత్‌లో అలాంటి వారి నుంచి ప్రాణహాని ఉందని అర్థమవుతోందని, భారత్ వస్తే తనను చంపేస్తారని ఛోక్సీ కోర్టుకు వివరించారు. ఈ మేరకు ఆ కార్యక్రమానికి సంబంధించి ఆడియో, వీడియో సీడీలను కోర్టుకు సమర్పించారు. దీనిపై కేసు విచారిస్తున్న సీబీఐ అక్టోబర్ మూడు లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంటూ ప్రత్యేక కోర్టు కేసును అక్టోబర్ నాలుగుకు వాయిదా వేసింది.