బిజినెస్

మూడోవారమూ పతనమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో వారం బలహీనపడ్డాయి. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ భారీగా 1,249.04 పాయింట్లు పడిపోయి, రెండు నెలల కనిష్ట స్థాయి 36,841.60 పాయింట్లకు దిగజారింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 372.10 పాయింట్లు కోల్పోయి, కీలకమయిన 11,200 స్థాయికన్నా దిగువకు దిగజారి 11,143.10 పాయింట్ల వద్ద ముగిసింది. గురువారం మొహర్రం పండుగ రావడంతో స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. కేవలం నాలుగు రోజులే పనిచేసిన స్టాక్ మార్కెట్లలో లావాదేవీలు వెనక్కి వస్తూ, ముందుకు వెళ్తూ తీవ్రమయిన ఊగిసలాట మధ్య సాగాయి. తొలుత రూపాయి విలువ పతనం కొనసాగింపు, అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, చివరలో ఫైనాన్సియల్ ఇండస్ట్రీలో సంక్షోభం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఊగిసలాటకు దారితీశాయి. ఈ వారంలో పనిచేసిన నాలుగు రోజుల్లోనూ మార్కెట్ కీలక సూచీలు పతనమయ్యాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతోందనే ఆందోళనలు, రూపాయి పతనం కొనసాగుతుండటం వల్ల లావాదేవీల ధోరణిపై ప్రతికూల ప్రభావం పడి, అనేక రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడం వల్ల మదుపరులు ఈ వారం తొలి రోజు నుంచీ షేర్ల విక్రయాలకే ప్రాధాన్యమిచ్చారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఈ వారంలో ఒక దశలో జీవనకాల కనిష్ట స్థాయి 72.99 వద్దకు దిగజారింది. ఫైనాన్సియల్ షేర్ల ధరలు భారీగా పడిపోవడం వల్ల మార్కెట్ కీలక సూచీలు పతనం కావడంతో ఈ వారం చివరి సెషన్ మదుపరుల్లో తీవ్ర నిరుత్సాహాన్ని నింపింది. బీఎస్‌ఈ సెనె్సక్స్ తీవ్ర స్థాయిలో ఊగిసలాటకు గురయింది. ఇంట్రా-డేలో ఒక శాతం పుంజుకుంటే తరువాత మూడు శాతం పడిపోతూ సాగింది. చివరకు 0.8 శాతం నష్టంతో ముగిసింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) రుణాలు చెల్లించలేని స్థితికి దిగజారిందని వచ్చిన వార్తలు మార్కెట్‌లోని ప్రతి ఫైనాన్సియల్ కంపెనీ షేర్లను కుదిపేసింది.
బీఎస్‌ఈ సెనె్సక్స్ ఈ వారం 38,027.81 పాయింట్ల దిగువ స్థాయి వద్ద ప్రారంభమయింది. తరువాత పతనమయి 35,993.64 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 1,249.04 పాయింట్ల (3.28 శాతం) దిగువన 36,841.60 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం వారం 554.43 పాయింట్లు (1.43 శాతం) నష్టపోయింది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా ఈ వారం 11,464.95 పాయింట్ల దిగువ స్థాయి వద్ద ప్రారంభమయింది. తరువాత మరింత పడిపోయి 10,866.45 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 372.10 పాయింట్ల (3.23 శాతం) దిగువన 10,866.45 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదిలా ఉండగా, ఈ వారం చమురు- సహజ వాయువు రంగాల షేర్లకు మాత్రమే మంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. దాదాపు మిగతా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, స్థిరాస్తి, ఐపీఓలు, విద్యుత్, వాహన, ఆరోగ్య సంరక్షణ, కన్స్యూమర్ డ్యూరేబుల్స్, పీఎస్‌యూలు, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ, టెక్నాలజి, ఐటీ, లోహ రంగాల షేర్లు విస్తృత స్థాయిలో అమ్మకాలకు గురయ్యాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల షేర్లు కూడా తీవ్ర స్థాయిలో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు), విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) కలిసి ఈ వారంలో నికరంగా రూ. 2,433.15 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.