జాతీయ వార్తలు

అభివృద్ధే సర్కారు లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాలిచేర్ (ఒడిశా): ఆర్థిక, వ్యవసాయ రంగాల్లో దేశాన్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. శనివారం ఇక్కడ రూ.13 వేల కోట్లతో తాలిచేర్ ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. వచ్చే 36 నెలల్లో ఈ ప్రాజెక్టు ఉత్పత్తిని ప్రారంభిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. బొగ్గును సహజవాయువుగా మార్చి, దాని ద్వారా వేపతో యూరియా ఉత్పత్తులను తయారు చేసేందుకు టెక్నాలజీని అమలు చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్లాంట్ ప్రారంభోత్సవానికి తాను మళ్లీ వస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సహజవాయువు, ఎరువులను దిగుమతి చేసేకునే బాధ తప్పుతుందన్నారు. ఎరువుల తయారీలో స్వావలంభన, స్వయం సమృద్ధి సాధిస్తామన్నారు. భారత్ వేగవంతంగా అభివృద్ధి చెందుతుందనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలన్నారు. భారత్‌ను అభివృద్ధిలో ఉచ్చస్థితికి తీసుకెళ్లనున్నట్లు చెప ఆపరు. అత్యంత ఆధునిక టెక్నాలజీని ఈ ప్లాంట్ పునరుద్ధరణకు ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. 1.27 మిలియన్ టన్నుల వేపమిశ్రమంతో యూరియా ఉత్పత్తిని తయారు చేస్తామన్నారు.్భరత్‌లో తొలిసారిగా బొగ్గుతో సహజవాయువును తయారు చేసే ప్రక్రియ ఈ ప్లాంట్‌లోనే చేపట్టినట్లు చెప్పారు. దాదాపు 4500 మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్లాంట్ టెక్నాలజీని రూపొందిస్తున్నట్లు చెప్పారు. తరచుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం, టెక్నాలజీ అప్‌డేట్ చేసుకోకపోవడం వల్ల 2002లో అప్పటి బీజేపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్లాంట్ మూతపడింది. 2011 ఆగస్టులో ఈ ప్లాంట్‌ను పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయించింది. ఒడిశాలోని నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు ఉమ్మడిగా ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు చేతులు కలిపాయన్నారు. గెయిల్ కోల్ ఇండియా, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్, ఎఫ్‌సీఐఎల్ సంస్థలు భాగస్వామంగా ఏర్పడి ప్లాంట్‌ను పునరుద్ధరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. ఉత్ప త్తుల్లో లక్ష్యసాధనకు కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పాల్గొన్నారు.

చిత్రం..తాలిచేర్ ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన తర్వాత
ప్రాజెక్టు నమూనాను పరిశీలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ