బిజినెస్

ద్రవ్యోల్బణం మోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: ద్రవ్యోల్బణం గణాంకాలు మోత మోగిస్తున్నాయి. నిన్నమొన్నటిదాకా అదుపులో ఉన్న చిల్లర, టోకు ధరల సూచీలు ఇప్పుడు మళ్లీ ఎగిసిపడుతున్నాయి. కూరగాయలు, పప్పు్ధన్యాలు, చక్కెర తదితర ఆహారోత్పత్తుల ధరలు పెరగడంతో గత నెల టోకు ద్రవ్యోల్బణం ఎగిసింది. జూన్‌లో 1.62 శాతంగా డబ్ల్యుపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం సూచీ నమోదైనట్లు గురువారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేశాయి.
మరోవైపు తాజా గణాంకాల నేపథ్యంలో వచ్చే నెల జరిపే ద్రవ్యసమీక్షలో ఆర్‌బిఐ కీలక వడ్డీరేట్లను తగ్గించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆగస్టు 9న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను నిర్వహించనున్నది తెలిసిందే. ఈ క్రమంలో రెపో రేటును ఆర్‌బిఐ తగ్గించాలని అసోచామ్ కోరుతోంది. ఇదిలావుంటే అంతకుముందు మే నెలలో 0.79 శాతంగా నమోదైన టోకు ధరల సూచీ.. నిరుడు జూన్‌లో మైనస్ 2.13 శాతంగా ఉంది. ఏడాదిన్నరకుపైగా కాలం నుంచి రుణాత్మకంలోనే కొనసాగిన టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు.. గత మూడు నెలల నుంచే గుణాత్మకంలోకి వచ్చాయి.
ఇకపోతే చిల్లర ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా జూన్‌లో భారీగా పెరిగినది తెలిసిందే. మంగళవారం విడుదలైన ఈ గణాంకాలు 22 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 5.77 శాతంగా నమోదయ్యాయి. ఉల్లిగడ్డ, పోషక పదార్థాలు, ఇంధనం, విద్యుత్, పెట్రోల్ ధరలు అదుపులోనే ఉన్నప్పటికీ కూరగాయలు, పప్పు్ధన్యాలు, చక్కెర, పండ్ల ధరలు పెరిగాయి. గతంతో పోల్చితే కూరగాయల ధరలు జూన్‌లో 16.91 శాతం పెరిగితే, ముఖ్యంగా బంగాళదుంప 64.48 శాతం ఎగిసింది.
చక్కెర 26.09 శాతం, పండ్లు 5.97 శాతం, పప్పు్ధన్యాలు 26.61 శాతం చొప్పున పెరిగాయి. మొత్తంగా ఆహార ద్రవ్యోల్బణం 8.18 శాతం మేర పెరిగింది.