బిజినెస్

‘వంద’ దిశగా పెట్రోలు పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పెట్రోలు ధర వంద రూపాయలకు చేరుకునే దిశగా పరుగులు తీస్తున్నది. రూపాయి మారకపు విలువ తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరగడం వంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, పెట్రో ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో పెరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం ముంబయిలో లీటరు పెట్రోలు ధర 11 పేసలు పెరిగి, 90.14 రూపాయలకు చేరింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషనల్ ఔట్‌లెట్స్‌లో ఈ ధర ఉండగా, హిందుస్థాన్ పెట్రోలియం పంపుల్లో 90.17 రూపాయలకు చేరింది. పెట్రోలుతోపాటు డీజిల్ ధర కూడా పెరిగింది. లీటరుకు ఐదు రూపాయల హెచ్చు నమోదైంది. ఢిల్లీలో లీటరు పెట్రోలు 82.72 రూపాయలుకాగా, డీజిల్ ధర 74.02 రూపాయలు. దేశంలోని మిగతా ప్రధాన నగరాలు, పట్టణాల్లోనూ పెట్రోలు, డీజిల్ ధరలు ఏమాత్రం తగ్గకుండా పెరుగుతునే ఉన్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే, అతి తక్కువ సమయంలోనే లీటర్ పెట్రోలు 100 రూపాయలకు చేరే అవకాశం లేకపోలేదు.