బిజినెస్

పీఎస్‌బీ ఉన్నతాధికారులతో జైట్లీ భేటీ నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) ఉన్నతాధికారులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం సమావేశం కానున్నారు. నిరర్థక ఆస్తుల అంశమే ప్రధాన అజెండాగా ఉండనుందని సమాచారం. గత కొంతకాలంగా పీఎస్‌బీల లావాదేవీలపై దృష్టి పెట్టిన కేంద్రం, నిరర్ధక ఆస్తులను గణనీయంగా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఈ వ్యవహారంలో సాధించిన పురోగతిని ఈ సమావేశంలో జైట్లీ సమీక్షించే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం వివిధ అంశాల్లో పురోగతిని చర్చించడానికి సమావేశాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ, మంగళవారం నాటి సమావేశాన్ని కీలకంగా భావిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ విలీన ప్రక్రియ కోసం ప్రత్యామ్నాయ విధానం (ఏఎం)ను అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత పెరిగిందని అంటున్నారు. ఈ మూడు బ్యాంక్‌ల విలీనంతో, దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అవతరించనుంది. అందుకే ఈ ప్రక్రియను అటు రిజర్వ్ బ్యాంక్, ఇటు కేంద్ర ప్రభుత్వం ఆషామాషీగా తీసుకోవడం లేదు. ఈ అంశాన్ని జైట్లీ కూలంకషంగా చర్చించనున్నట్టు తెలుస్తున్నది. అదే విధంగా రానిబాకీలు, బుణభారం తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.