బిజినెస్

భారత్, పాక్ మధ్య క్షీణించిన వాణిజ్య బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 25: భారత్, పాకిస్తాన్ మధ్య వాణిజ్య లావాదేవీలు 37 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ వివరాలను ప్రపంచ బ్యాంకు నివేదికలో పేర్కొంది. ఇరు దేశాల మధ్య నిరంతరం ఉద్రిక్తతలు నెలకొనడం వల్ల వాణిజ్య రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం లోపించింది. ఈ నివేదికకు ఏ గ్లాస్ హాఫ్ ఫుల్ అని నామకరణం చేశారు. దక్షిణాసియాలో ప్రాంతీయాభివృద్ధికి అవకాశం ఉన్నా, ఇరుదేశాల మధ్య నెలకొన్న వైరం వల్ల వాణిజ్య రంగం కుంటుపడిందని ప్రపంచ బ్యాంకు నివేదికలో పేర్కొంది. అనేక వస్తువులకు సంబంధించి ఇరు దేశాలు రాయితీలు మంజూరు చేయడం లేదు. టారిఫ్ మినహాయింపులు లేవు. ద్వైపాక్షిక ఒప్పందాలు అమలు కావడం లేదు. పాకిస్తాన్ దక్షిణాసియా దేశాల నుంచి 936 ఉత్పత్తులను తెప్పించుకోవాలని నిర్ణయించినా, ఆచరణలో అమలు కావడం లేదు. దక్షిణాసియా స్వేచ్చా విపణి ద్వారా ఇంత పెద్ద సంఖ్యలో వాణిజ్యానికి వీలుంది. భారత్ లిస్టులో 64 ఐటమ్స్ ఉన్నాయి. శ్రీలంకతో భారత్‌కు ప్రత్యేక ఒప్పందం ఉండడంతో, అందులో భాగంగా ప్రత్యేకంగా ఎగుమతులు, దిగుమతులకు వీలుంది. 1996లో భారత్ పాకిస్తాన్‌కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను మంజూరు చేసింది. పాకిస్తాన్ మాత్రం భారత్‌కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను ఇవ్వలేదు. పాకిస్తాన్ జాబితాలో ఉన్న 1209 ఐటమ్స్‌ను ఎటువంటి పరిస్థితుల్లో భారత్ నుంచి దిగుమతి చేసుకోరాదని నిర్ణయం తీసుకుని అమలు చేస్తోంది. అటారి వాఘా సరిహద్దు ద్వారా 138 ఐటమ్స్‌ను మాత్రమే దిగుమతి చేసుకునేందుకు పాకిస్తాన్ అనుమతిస్తుంది. ఇరు దేశాల మధ్య ప్రజల కదలికలపై కూడా చాలా ఆంక్షలు ఉన్నాయి. నిరంతరం ఉద్రిక్తతలు కొనసాగడం, సహకారం లేకపోవడం తదితర కారణాల వల్ల ఇరుదేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు క్షీణదశలో ఉన్నాయి.