బిజినెస్

ఐదు రోజుల నష్టాలకు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 25: వరుసగా అయిదు సెషన్ల పాటు నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తిరిగి బలపడ్డాయి. బ్యాంకింగ్, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్ కీలక సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఊగిసలాట మధ్య సాగిన లావాదేవీలలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 347.04 పాయింట్లు (0.96 శాతం) పుంజుకొని, 36,652.06 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో ఈ సూచీ 36,705.79 పాయింట్ల గరిష్ఠ స్థాయిని, 36,064.10 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ మంగళవారం 100.05 పాయింట్లు (0.91 శాతం) పెరిగి 11,067,45 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో ఈ సూచీ గరిష్ఠ స్థాయి 11,080.60 పాయింట్లు, కనిష్ట స్థాయి 10,882.85 పాయింట్ల మధ్య కదలాడింది. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నేతృత్వంలో ఫైనాన్సియల్ స్టాక్‌లు కోలుకోవడం కీలక సూచీలు అయిదు రోజుల నష్టాలకు తెరదించి, పుంజుకోవడానికి దోహదపడింది. గత వరుస అయిదు సెషన్లలో బీఎస్‌ఈ సెనె్సక్స్ 1,785.62 పాయింట్లు (అయిదు శాతానికి పైగా) పడిపోయింది. రుణాలు చెల్లించలేని స్థితికి చేరిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ను ఎల్‌ఐసీ మూతపడనివ్వబోదని, దాని ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి ఉన్న మార్గాలను అనే్వషిస్తోందని ఎల్‌ఐసీ చైర్మన్ వీకే శర్మ ప్రకటించిన తరువాత స్టాక్ మార్కెట్‌లో సానుకూల ధోరణి నెలకొనడంతో కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ల ధరలు తిరిగి బలంగా పుంజుకున్నాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నిధుల సేకరణలో విజయవంతమయిందని వచ్చిన వార్తలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. అమెరికా-చైనా మధ్య తాజా దిగుమతి సుంకాల వివాదంతో పాటు చమురు ధరలు సుమారు నాలుగేళ్ల గరిష్ఠ స్థాయికి పెరగడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై నెలకొన్న ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఈ కారణంగా మొత్తం మీద సెంటిమెంట్ బలహీనంగా ఉంది. అయితే, ఊగిసలాట మధ్య సాగిన లావాదేవీలలో నిర్దిష్టమయిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం వల్ల కీలక సూచీలు పుంజుకున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా మంగళవారం ఆరంభంలో చవిచూసిన నష్టాలను తరువాత అధిగమించి ఇంట్రా-డేలో అయిదు పైసలు పైన 72.58 వద్దకు చేరింది. సెప్టెంబర్ నెల డెరివేటివ్‌ల కాలపరిమితి గురువారం ముగియనుండటంతో స్పెక్యులేటర్లు తమ పొజిషన్లను కవర్ చేసుకోవడం కూడా మార్కెట్‌లో ర్యాలీ రావడానికి దోహదపడింది. ఇదిలా ఉండగా, సోమవారం దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) నికరంగా రూ. 2,284.26 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, విదేశీ మదుపరులు రూ. 1,231.70 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.
సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో యాక్సిస్ బ్యాంక్ మంగళవారం అత్యధికంగా 2.96 శాతం లాభపడింది. హెచ్‌డీఎఫ్‌సీ 2.95 శాతం లాభంతో తరువాత స్థానంలో నిలిచింది. లాభపడిన ఇతర సంస్థల్లో కోటక్ బ్యాంక్, హెచ్‌యూఎల్, మారుతి సుజుకి, సన్ ఫార్మా, ఎస్‌బీఐ, ఆసియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఐటీసీ లిమిటెడ్, ఓఎన్‌జీసీ, భారతి ఎయిర్‌టెల్, వేదాంత, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్ ఉన్నాయి. ఇందుకు భిన్నంగా యెస్ బ్యాంక్ 2.83 శాతం నష్టపోయింది. యెస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ రాణాకపూర్ పదవీకాలాన్ని ఆర్‌బీఐ కుదించిన దరిమిలా భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించడానికి మంగళవారమే తరువాత ఆ బ్యాంకు బోర్డు సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆ బ్యాంకు షేర్ల విలువ పతనమయింది.