బిజినెస్

అప్పులు ఎగ్గొడితే కఠిన వైఖరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టేవారిపై, అక్రమాలకు పాల్పడే వారిపై పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కఠిన వైఖరిని అవలంబించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ కోరారు. బ్యాంకుల పనితీరును ఆయన సమీక్షిస్తూ క్రమబద్ధీకరణమైన ఆర్థిక వ్యవస్థవల్ల 8 శాతం ఆర్థిక వృద్ధిరేటును సాధిస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. బ్యాంకులు పారదర్శకమైన రుణ విధానాన్ని అమలు చేయాలని, అదే సమయంలో అవకవతకలకు పాల్పడే వారిపై, ఉద్దేశపూర్వకంగా బకాయిలు ఎగ్గొట్టే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంక్, దేనాబ్యాంక్‌లు విలీనం కావడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఈ మూడింటి కలయికతో ఒక పటిష్టమైన వ్యవస్థ ఏర్పడిందని అన్నారు. రానిబాకీల వసూలుకు బ్యాంకులు సాధ్యమైనంత వరకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో రుణగ్రస్తుల నుంచి 36,551 కోట్ల రూపాయలను వసూలు చేశారని, ఇది 2017-18తో పోలిస్తే 49 శాతం అధికమని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణ ద్వారా ఆర్థిక వృద్ధి రెట్టింపు అవుతుందని, దీని ద్వారా భారత్ 8 శాతం వృద్ధి రేటుకు చేరుకుంటుందని అన్నారు. అలాగే డిజిటల్ పేమెంట్స్, ఐబిసి, జీఎస్టీ ద్వారా ఆర్థికంగా వృద్ధి చెందుతామని జైట్లీ పేర్కొన్నారు.