బిజినెస్

సరకు రవాణా ద్వారా దక్షిణ తూర్పు రైల్వేకు 6శాతం అదనపు ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, అక్టోబర్ 10: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడచిన ఆరు నెలల్లో దక్షిణ తూర్పు రైల్వే సరకు రవాణాద్వారా 6007.17 కోట్ల రూపాయలు ఆర్జించింది. 2018-19 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు గడచిన సంవత్సరం ఇదే కాలవ్యవధితో పోలిస్తే 348.59 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం ఈ రైల్వేకు సమకూరింది. అంటే 6.16 శాతం అదనపు ఆదాయం ఈ రైల్వే గడించింది. గడచిన ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మాసం వరకు 75.06 మిలియన్ టన్నుల సరకు లోడింగ్ జరిగిందని రైల్వే అధికార ప్రతినిధి సంజయ్‌ఘోష్ తెలిపారు. గడచిన యేడాది ఇదే కాలంలో 73.56 మిలియన్ టన్నుల సరకు లోడింగ్ జరిగిందన్నారు. అంటే సరకు లోడింగ్‌లో సైతం 2.04 శాతం అదనపు అభివృద్ధి నమోదైందన్నారు. ప్రత్యేకించి బొగ్గు లోడింగ్ ఆరు నెలల్లో 50శాతం అదనంగా జరిగిందని ఘోష్ తెలిపారు. ఈ కాలంలో మొత్తం 16.45 మిలియన్ టన్నుల బొగ్గు, 39.52 మిలియన్ టన్నుల ఐరన్‌వోర్, 7.56 మిలియన్ టన్నుల పిగ్ ఐరన్, ఇనుము, 5.46 టన్నుల సిమెంటు లోడింగ్ జరిగిందని వివరించారు.