బిజినెస్

ఒడిదుడుకులను తట్టుకున్న మ్యూచువల్ ఫండ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: స్టాక్‌మార్కెట్లో సెప్టెంబర్ మాసంలో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదురైనా దేశీయ స్టాక్ మార్కెట్ వాటాల్లో మ్యూచువల్‌ఫండ్ సంస్థలు రూ.11,600 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. అదే సమయంలో విదేశీ పెట్టుబడీదారులు రూ.10825 కోట్ల సొమ్మును విత్ డ్రా చేశారు. గత నెలలో మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు దాదాపు రూ.11638 కోట్లను వివిధ షేర్ల కొనుగోలుకు వెచ్చించారని సెబీ సంస్థ పేర్కొంది. సిస్టమ్యాటిక్ ఇనె్వస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా రిటైల్ ఇనె్వస్టర్లు నిరంతరం పెట్టుబడులు పెట్డడం వల్ల దేశీయంగా స్టాక్‌మార్కెట్లలో వాటాలను కొనుగోలు చేసి పెట్టుబడులు పెట్టేందుకు వీలైంది. దీనిని బట్టి మ్యూచువల్ ఫండ్ల పట్ల ప్రజల్లో చెక్కు చెదరని నమ్మకం ఏర్పడినట్లు గుర్తించామని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ వివరాలను అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్‌ఎస్ వెంకటేష్ చెప్పారు. గత నెలలో సెనె్సక్స్ 6.2 శాతం మేరకు పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా క్షీణించింది. విదేశీ పోర్ట్ఫులియో ఇనె్వస్టర్లు లాభాలను దండుకుని వైదొలిగారు. వీరు గత నెలలో షేర్లను తెగనమ్మారు. మార్నింగ్‌స్టార్ సీనియర్ అనలిస్టు మేనేజర్ రీసెర్చి హిమాంసు శ్రీవాత్సవ మాట్లాడుతూ మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల నిధులు ఆవిరి అయినా, మ్యూచువల్ ఫండ్స్‌లోకి నిరంతరం సిప్ ద్వారానిధులు రావడం మంచి పరిణామమన్నారు. ఇటీవల మార్కెట్‌లో ఒడిదుడుకుల సమయంలో దేశీయంగా షేర్లను కొనుగోలు చేసేందుకు మంచి అవకాశమని శ్రీవాత్సవ చెప్పారు. భవిష్యత్తులో మ్యూచువల్ ఫండ్ మార్కెట్ మరింత బలపడుతుందని ఆయన చెప్పారు.