క్రీడాభూమి

షూటింగ్‌లో సౌరభ్ చౌదరికి గోల్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యూనోస్ ఎయిరెస్, అక్టోబర్ 10: యూత్ ఒలింపిక్స్‌లో భారత టీనేజ్ సంచలనం, యువ షూటర్ సౌరభ్ చౌదరి గోల్డ్‌మెడల్ సాధించాడు. బుధవారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పోటీపడిన 16 ఏళ్ల సౌరభ్ ఫైనల్‌లో 244.2 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్‌ను తన ఖాతాలో జమ చేసుకున్నాడు. దక్షిణ కొరియా షూటర్ సుంగ్ యున్‌హో 236.7 మీటర్లతో రజతం, స్విట్జర్లాండ్ షూటర్ సొలారి జాసన్ 215.6 మీటర్లతో కాంస్యం దక్కించుకున్నారు. కాగా, సౌరభ్ చౌదరి ఇటీవల జరిగిన ఆసియ గేమ్స్, జూనియర్ ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్స్ అందుకున్నాడు.