బిజినెస్

కొనసాగిన మార్కెట్ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: వరుస పతనాలతో అల్లాడిన సెనె్సక్స్ బుధవారం కోలుకుంది. రూపాయి మారకపు విలువ రికార్డు స్థాయి పతనం నుంచి మెరుగు పడడంతో, ర్యాలీ కొనసాగింది. ఒకానొక దశలో 34,858.35 పాయింట్లకు చేరింది. మొత్తం మీద ఆరంభంలో మందగొడిగా సాగినప్పటికీ, మధ్యలో విపరీతమైన వేగంతో ముందుకు కదిలిన మార్కెట్ ర్యాలీ జోరు చివరిలో తగ్గింది. అయినప్పటికీ, స్థూలంగా చూస్తే స్టాక్స్ ట్రేడింగ్ ఆశాజనకంగానే ముగిసింది. 34,493.21 పాయింట్ల వద్ద బుధవారం మొదలైన మార్కెట్ ట్రేడింగ్ ఒకానొక దశలో 34,585.35 పాయింట్లకు చేరింది. ఆ తర్వాత కొంత తగ్గి, 34,760.89 పాయింట్ల వద్ద ముగిసింది. స్థూలంగా చూస్తే సెనె్సక్స్ 461.42 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ కూడా మెరుగైన స్థితిలో నిలిచింది. 10,400 పాయింట్ల వద్ద మొదలై, అత్యధికంగా 10,482.35 పాయింట్ల వరకూ చేరి, చివరికి 159.05 పాయింట్లు మెరుగుపడి 10,460.10 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరగడం, రూపాయి విలువ గతంలో ఎన్నడూ లేనంత కనిష్టానికి పడిపోవడం వంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపడంతో వరుస నష్టాలతో అల్లాడిన స్టాక్ మార్కెట్‌కు బుధవారం ఊరట లభించచింది. పతనం నుంచి రూపాయి నిలదక్కొకోవడం మొదలైంది. మరోవైపు పెట్రోలు, డీజిల్ ధరలను నియంత్రీకరించడానికి కేంద్ర ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఈ పరిణామాలు సహజంగానే స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. ఈ మార్పుతో మదుపరులు కొనుగోళ్లపై దృష్టి పెట్టారు. ఆరంభంలో, తదుపరి చివరిలో అమ్మకాల శాతం పెరిగినప్పటికీ, మార్కెట్ లాభాల బాట పట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రభుత్వ బాండ్ల కొనుగోలు
ఆర్‌బీఐ గురువారం వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి 12,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనుంది. పండుగను దృష్టిలో ఉంచుకొని, అధిక మొత్తంలో ద్రవ్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేగాక, ఎన్‌బీఎప్‌సీను ఒడ్డున పడేయడానికి, నష్టాల్లో కూరుకుపోయిన వివిధ కంపెనీలకు చెందిన సుమారు 45,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కొనుగోలు చేయాలని కూడా ఆర్‌బీఐ తీర్మానించింది. ఈ నిర్ణయం వల్ల మార్కెట్‌లోకి ద్రవ్యం ఇన్‌ఫ్లో పెరుగుతుంది. ఇలావుంటే, బుధవారం డాలర్‌కు రూపాయి మారకపు విలువ 34 పైసలు పెరిగి, రూ.74.05 వద్ద స్థిరపడింది.