బిజినెస్

పడిలేచిన రూపాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 11: రూపాయి విలువ గురువారం ఇంట్రా-డేలో సరికొత్త కనిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రా-డేలో 24 పైసలు పతనమయి, 74.50 వద్దకు చేరింది. ప్రపంచ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు హోరెత్తడంతో దాని ప్రతికూల ప్రభావం వల్ల రూపాయి విలువ పతనమయింది. అయితే, తరువాత పుంజుకుంది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే తొమ్మిది పైసల ఎగువన 74.12 వద్ద ముగిసింది. ముడి చమురు ధరల తగ్గుదల, ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్ బలహీనపడటం తిరిగి రూపాయి పుంజుకోవడానికి దోహదపడ్డాయి. ప్రపంచ వృద్ధిపై నెలకొన్న ఆందోళనలు, అమెరికాలో పెట్టుబడులపై ఆదాయాలు పెరగడం వల్ల అమెరికా స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోవడం, దాని ప్రతికూల ప్రభావం వల్ల ఆసియా, ఐరోపా మార్కెట్లు కూడా పతనం కావడం జరిగింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ (్ఫరెక్స్) మార్కెట్‌లో గురువారం ఉదయం డాలర్‌తో రూపాయి మారకం విలువ దిగువ స్థాయి 74.37 వద్ద ప్రారంభమయి, తరువాత మరింత దిగజారి సరికొత్త కనిష్ట స్థాయి 74.50కు పతనమయింది. దిగుమతిదారుల నుంచి అమెరికన్ డాలర్‌కు మంచి డిమాండ్ ఉండటం, భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు నిరాటంకంగా తరలిపోతుండటం రూపాయి విలువ పతనానికి దారితీశాయి.