బిజినెస్

అమ్మకాల జోరుతో కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల జోరు కొనసాగడంతో దేశీయ మార్కెట్లలో మదుపరుల సెంటిమెంట్ తీవ్రంగా దెబ్బతిని మార్కెట్ కీలక సూచీలు పడిపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 750 పాయింట్లు పడిపోయి, ఆరు నెలల కనిష్ట స్థాయి వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కీలకమయిన 10,300 పాయింట్ల స్థాయికి దిగువన స్థిరపడింది. గురువారం దిగువ స్థాయి వద్ద ప్రారంభమయిన సెనె్సక్స్ ఇంట్రా-డేలో 1,000 పాయింట్లకు పైగా పడిపోయి, 34,000 పాయింట్ల స్థాయికన్నా దిగువకు దిగజారి 33,723.53 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. మధ్యాహ్నం తరువాత లావాదేవీలలో కొంత కోలుకొని, 34,325.09 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 759.74 పాయింట్ల (2.19 శాతం) దిగువన 34,001.15 పాయింట్ల వద్ద ముగిసింది. ఏప్రిల్ 11 తరువాత ఈ సూచీ ఇంత దిగువ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. ఈ సూచీ బుధవారం 461.42 పాయింట్లు పుంజుకుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 225.45 పాయింట్లు (2.16 శాతం) దిగజారి 10,234.65 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకు ముందు ఈ సూచీ 10,138.60- 10,335.95 పాయింట్ల మధ్య కదలాడింది. ‘ప్రపంచ మార్కెట్లకు తల్లిలాంటిదయిన అమెరికా మార్కెట్ సూచీలు వేగంగా పడిపోవడం వల్ల ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి. అందులో భాగంగానే భారత మార్కెట్లూ నష్టపోయాయి’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇనె్వస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో ఎస్‌బీఐ గురువారం అత్యధికంగా 5.74 శాతం నష్టపోయింది. టాటా స్టీల్ 4.60 శాతం నష్టంతో తరువాత స్థానంలో నిలిచింది. ఐటీ దిగ్గజం టీసీఎస్ రెండో త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న తరుణంలో దాని షేర్ల విలువ 3.10 శాతం పడిపోయింది. టీసీఎస్ ఫలితాలు గురువారం మార్కెట్ పనివేళలు ముగిసిన తరువాత వెలువడ్డాయి. నష్టపోయిన ఇతర సంస్థల్లో వేదాంత, ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్, అదాని పోర్ట్స్, భారతి ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, కోటక్ బ్యాంక్, మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, ఐటీసీ ఉన్నాయి. వీటి షేర్ల విలువ 4.45 శాతం వరకు పడిపోయింది. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీసీ బ్యాంక్, రిల్, విప్రో, ఎన్‌టీపీసీ, ఆసియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, హెచ్‌యూఎల్ షేర్ల విలువ కూడా 1.45 శాతం వరకు తగ్గింది. మరోవైపు, సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో ఓఎన్‌జీసీ అత్యధికంగా 2.86 శాతం, యెస్ బ్యాంక్ 2.54 శాతం చొప్పున లాభపడ్డాయి. ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీల షేర్ల విలువ పెరిగింది. హెచ్‌సీపీఎల్, బీపీసీఎల్, ఐఓసీ షేర్ల విలువ 14.70 శాతం వరకు పెరిగింది. ఏవియేషన్ ఇండస్ట్రీని ఆదుకోవడానికి ప్రభుత్వం బుధవారం జెట్ ఇంధనంపై ఎక్సైజ్ పన్నును 11 శాతానికి తగ్గించడంతో విమానయాన సంస్థల షేర్ల విలువ వరుసగా రెండో రోజు గురువారం పెరిగింది. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు కూడా గురువారం 2.81 శాతం వరకు పడిపోయాయి.