బిజినెస్

మరో రూ.2.50 పెరిగిన డీజిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: ప్రభుత్వ చర్యలు, ఆర్‌బీఐ సూచనలు పెట్రో ధరల పెరుగుదలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ఇటీవల కాలంలో పెరుగుతూ వస్తున్న డీజిల్ ధర సోమవారం మరో 2.50 రూపాయలు పెరిగింది. కేంద్ర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించగా, కొన్ని ఆయిల్ కంపెనీలు సబ్సిడీలను ప్రకటించాయి. పన్నును 2.50 రూపాయల మేరకు తగ్గించాల్సిందిగా రాష్ట్రాలను కేంద్రం కోరింది. మొత్తం మీద పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలకు కళ్లెం వేయడానికి ఒకవైపు ప్రయత్నం జరుగుతుంటే, మరోవైపు ధరల పెరుగుదల కొనసాగతునే ఉంది. నిజానికి గత పది రోజులుగా పెట్రోలు ధర పెరుగుతునే ఉంది. డీజిల్ ధర కొంత స్థిరపడింది. చివరిసారిగా, పది రోజుల క్రితం 2.10 రూపాయలు పెరిగిన డీజిల్ ధర, సోమవారం మరో 2.50 రూపాయలు పెరిగింది. తాజా పెరుగుదలతో, లీటరు డీజిల్ ధర ఢిల్లీలో 75.46 రూపాయలకు చేరింది. పెట్రోలు ధర 82.72 రూపాయలుగా కొనసాగుతున్నది. ఇలావుంటే, ఢిల్లీలో డీజిల్ ధర గతంలో ఎన్నడూ 75.45 రూపాయలకు చేరలేదు. చాలా రాష్ట్రాల్లో డీజిల్ ధర ఢిల్లీ కంటే తక్కువే ఉంది. కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే వివిధ రాష్ట్రాలు స్థానిక అమ్మకపు పన్నును, వాట్‌ను తగ్గించడం ద్వారా డీజిల్ ధర మరింత పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర భారీగా పెరడంతో దాని ప్రభావం రీటైల్ అవుట్‌లెట్స్‌పైనా పడింది. పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని 1.50 రూపాయలు తగ్గించింది. సర్కారు సూచనతో ఆయిల్ కంపెనీలు రూపాయి సబ్హిడీని ప్రకటించాయి. దీనితో మొత్తం మీద లీటర్ పెట్రోలు, డీజిల్ ధర 2.50 రూపాయిలు తగ్గాయి. అదే సమయంలో, అమ్మకపు పన్ను, వాట్‌ను రూ. 2.50 వరకూ తగ్గించాల్సిందిగా రాష్ట్రాలకు కేం ద్రం సూచించింది. ఆ వెంటనే, పన్ను తగ్గిస్తున్నట్టు గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. చత్తీస్‌గఢ్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, అస్సాం, ఉత్తరాఖండ్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలూ అంతే మొత్తంలో పన్నుల్లో రాయితీ ప్రకటించాయి. ప్రస్తుతం రాష్టప్రతి పాలనలో ఉన్న జమ్మూకాశ్మీర్ కూడా లీటర్ పెట్రోలు, డీజిల్‌పై 2.50 రూపాయల మేర పన్నులను తగ్గించింది. కాగా, ఆ రాష్ట్రాల ప్రతిస్పందన చూసిన తర్వాత, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సైతం పన్ను రాయితీని ప్రకటించాయి. ఈ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, కేంద్రం గతం తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఇప్పటికీ పెట్రో ఉత్పత్తుల ధరలపై కనిపిస్తునే ఉంది.