బిజినెస్

రూ.218 కోట్ల ఆస్తుల జప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను మోసగించి సుమారు రూ. 13వేల కోట్ల రుణం తీసుకున్న కేసులో నిందితులకు చెందిన రూ. 218 కోట్లకు పైగా ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం జప్తు చేసింది. నిందితులకు దేశంలోపల, విదేశాలలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని నిబంధల కింద ముంబయిలోని ఈడీ జోనల్ కార్యాలయం మూడు ఆదేశాలు జారీ చేసిందని అధికారులు తెలిపారు. పీఎన్‌బీని వంచించిన కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ, ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ ప్రధాన అనుచరుడు అమెరికాలో ఉంటున్న మిహిర్ భన్సాలితో పాటు ఏపీ జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్క్ అనే కంపెనీకి చెందిన ఆస్తులను జప్తు చేసినట్టు అధికారులు వివరించారు. మూడు ఆదేశాల కింద జప్తు చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ. 218.46 కోట్లని పేర్కొన్నారు. పీఎన్‌బీకి చెందిన ముంబయిలోని బ్రాడీ హౌస్ బ్రాంచ్‌ని నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ సుమారు రెండు బిలియన్ డాలర్ల (రూ. 13,000 కోట్లకు పైగా) మేరకు మోసగించిన ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో పాటు ఈడీ దర్యాప్తు చేస్తోంది. మెహుల్ చోక్సీ కరీబియన్ దేశమయిన ఆంటిగ్వా, బర్బుడాలలో ఉన్నట్టు సమాచారం. ఈ కేసులో ఇంటర్‌పోల్ ఇప్పటికే భన్సాలికి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసింది.