బిజినెస్

ముడిచమురు సరఫరాదారుల నుంచి ఎలాంటి సమస్యాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ఇరాన్‌లో అమెరికా మంజూరులపై ఆంక్షలు ఓవైపు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ముడిచమురు నిల్వలవల్ల ఆలోటును భర్తీచేయడం పెద్ద సమస్య కాబోదని, అయితే ఓ పెద్ద చమురు సరఫరాచేసే కంపెనీని కోల్పోవడం వల్ల మన దేశంలో ధరల పెరుగుదలకు అవకాశం ఏర్పడిందని నిపుణులు అంచనా వేశారు. ఇరాన్ నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్నందువల్ల అమెరికా మంజూరులను రద్దు చేయమని కోరుతారా అన్న ప్రశ్నకు కేంద్ర ఇంధన వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ ఈ పర్షియన్ గల్ఫ్ దేశం నుంచి మన దేశానికి వచ్చే నవంబరు మాసానికి ముడి చమురును దిగుమతి చేసుకునేందుకు గల అవకాశాలను బేరీజువేస్తున్నామని, అయినా ఈ విషయంలో కొత్తగా చెప్పేందుకు మరే విషయం లేదని ఆయన తేల్చిచెప్పారు. రెండు రాష్ట్రాలకు చెందిన సొంత చమురు రీఫైనర్లు వచ్చే నవంబర్ మాసంలో 1.25 మిలియన్ టన్నుల ముడిచమురును దిగుమతి చేసుకునేందుకు ఆర్డర్లు బుక్‌చేశాయని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. కాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఉన్న 2015 నాటి అణు ఒప్పందాన్ని గత మేనెలలో రద్దు చేసుకున్నారు, అలాగే పర్షియన్ గల్ఫ్ దేశాలకు ఆర్థిక మంజూర్లపై ఆంక్షలు విధించారు. ఈ మంజూర్లు కొన్ని ఆగస్టు నుంచి అమలులోకి రాగా, ప్రధానంగా చమురు, బ్యాంకింగ్ రంగాలను ప్రభావితం చేసే మంజూర్లు నవంబర్ 4 నుంచి అమలులోకి రానున్నాయి, ఈ ఆంక్షలు అమలులోకి వస్తే ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే దేశాలకు బ్యాంకింగ్ మార్గాలు మూసుకుపోయే అవకాశం ఉందని, అలాగే ఆ చమురును ప్రాసెస్ చేసే రీఫైనరీలకు మంజూరయ్యే రీ ఇన్సూరెన్స్ కవరేజీ కూడా కోల్పోయే అవకాశం వుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మనదేశంలో ముడిచమురు నిల్వలు ప్రస్తుతానికి సంతృప్తికరంగానే ఉన్నాయని, అందువల్ల ఇదేమంత సమస్య కాబోదని వారంటున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి మార్కెట్ సెంటిమెంట్‌కు ప్రతిబంధకంగా ఉన్నాయంటున్నారు. ఇదే ప్రస్తుతం నెలకొన్న పెద్ద మార్పు అని మంత్రి ప్రధాన్ విలేఖరులతో అన్నారు. అయితే సమస్య వచ్చిన తొలి రోజునుంచే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్న దృష్ట్యా ముడిచమురు వనరులు ప్రస్తుతానికి పెద్ద సమస్య కాబోదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు నిల్వలు అనేక దేశాల్లో ఉన్నాయని, అయితే భౌగోళికంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి దృష్ట్యా ఓ పెద్ద సరఫరాదారుకు దూరమవడం మార్కెట్ సెంటిమెంటును దెబ్బతెస్తోందని ఆయన అన్నారు. చమురు ధరలు నాలుగేళ్లలో లేనంత అత్యధికంగా ఈనెలలో బ్యారల్ 86.74 అమెరికన్ డాలర్లకు చేరాయని, ఈ క్రమంలో అమెరికా మంజూర్లతో ఇరానియన్ ఎగుమతులపై నష్టాలను చవిచూసే అవకాశం ఏర్పడిందని ఆయన చెప్పారు. మరో రెండు నెలలు ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు కొనసాగితే బ్యారల్ ధర 81 అమెరికా డాలర్లకు దిగివచ్చే అవకాశం ఉందని మంత్రి ప్రధాన్‌తోబాటు విలేఖరుల సమావేశంలో పాల్గొన్న ఐహెచ్‌ఎస్ మార్కెట్ వైస్ చైర్మన్ డేనియల్ యర్గిన్ పేర్కొన్నారు.