బిజినెస్

రూపాయకి ఊరట..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 17: దారుణంగా పడిపోతూ, ఒకానొక ధశలో రికార్డు కనిష్టానికి చేరుకున్న రూపాయి మారకపు విలువ క్రమంగా బలపడుతున్నది. డాలర్‌కు రూపాయి విలువ ఆరు పైసలు పెరుగుపడడంతో, 73.42 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకున్న పరిణామాలు, దేశీయ ఈక్విటీ మార్కెట్‌లోని పరిస్థితులు రూపాయి బలపడేందుకు సహకరించాయి. ముడి చమురు ధర కొద్దిగా తగ్గడం, వాణిజ్య లోటును భర్తీ చేయడానికి అవకాశాలు లభించడం వంటి అంశాలు రూపాయి విలువను పెంచుతున్నాయి. రికార్డు పతనం నుంచి క్రమంగా కోలుకుంటున్న రూపాయి త్వరలోనే మరింత బలపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.