బిజినెస్

పతనం మొదలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: గత వారం చివరిలో, ఈవారం ఆరంభంలో రెండు రోజులు లాభాల బాటలో పయనించిన సెనె్సక్స్ పతనం మొదలైనట్టుగా కనిపిస్తోంది. బుధవారం ట్రేడింగ్లో 383 పాయింట్లు కోల్పోయి, 35,000 సూచీ కంటే దిగువకు పడిపోయింది. పెట్టుబడిదారులు ఆసక్తిని ప్రదర్శించకపోగా, షేర్ల అమ్మకానికి డిమాండ్ పెరగడంతో సెనె్సక్స్ నష్టాన్ని చవిచూసింది. బాంబే స్టాక్ ఏక్ఛ్సేంజ్‌లో బుధవారం లావాదేవీలు మొదలైన తర్వాత, కొంత సేపు నష్టాలవైపు, మరికొంత సేపు లాభాలవైపు ట్రేడింగ్ ఊగిసలాడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వితీయ త్రైమాసిక ఫలితాల కోసం ఎదురుచూడకుండా కొంత మంది షేర్ల అమ్మకానికి మొగ్గు చూపడంతో సెనె్సక్స్ పతనం మొదలైంది. మొదటి రెండు సెషన్స్‌లో అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగానే కొనసాగడంతో, సెనె్సక్స్ పాయింట్లు నిలకడగా ఉన్నాయి. చివరి వరకూ అదే పరిస్థితి ఉంటుందన్న నిపుణుల అభిప్రాయం తప్పయింది. చివరిలో సెంటిమెంట్ బాగా పని చేసింది. వరుస లాభాలతో స్టాక్ మార్కెట్ ముందుకు పరుగెడుతున్నది కాబట్టి, భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న అనుమానంతో, అధిక ధర పలికినప్పుడే వాటాలను అమ్మాలన్న అభిప్రాయం మదుపరుల్లో వ్యక్తమైంది. ఫలితంగా చివరిలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. చివరికి సెనె్సక్స్ 383 పాయింట్లు పడిపోయి, 34,727.16 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్ మాదిరిగానే ఆటుపోట్లకు గురైన నిఫ్టీ కూడా 131.70 పాయింట్లు నష్టపోయి, 10,453 పాయింట్ల వద్ద ముగిసింది. ముడి చమురు ధర, రూపాయి మారకపు విలువ వంటి అంశాలు స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లోనూ ఇదే ఒరవడి కనిపించింది. భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడంతో, అమ్మకాలు పెరిగాయని, ఫలితంగా బుధవారం ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగిందని నిపుణులు అంటున్నారు. దసరా తర్వాత మళ్లీ పుంజుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.