బిజినెస్

నష్టాల్లో సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 19: దసరా పండుగ సెలవు తర్వాత శుక్రవారం తెరచుకున్న స్టాక్ ఎక్ఛ్సేంజిలో లావాదేవీలు మందగొడిగా సాగాయి. గత కొన్ని రోజులుగా సాగుతున్న ఒడిదుడుకుల ట్రేడింగ్ మరోసారి పునరావృతమైంది. మొత్తం మీద 463.95 పాయింట్లు నష్టపోయిన సెనె్సక్స్ 34,315.63 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం నష్టాలను ఎదుర్కొంది. 149.50 పాయింట్లు పతనమై, 10,303.55 పాయింట్ల వద్ద తెరపడింది. హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ నష్టాల ప్రభావం సెనె్సక్స్‌పై స్పష్టంగా కనిపించింది. తగినంత ద్రవ్యం చేతిలో లేనందువల్ల నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లైన ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ ఇంజనీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ తదితర కంపెనీల షేర్లు సగటున 16.55 శాతం నష్టపోయాయి. ఉదయం ట్రేడింగ్‌లోనే రిలయన్స్ సహా పలు కీలక కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. మధ్యాహ్నం కొంత కోలుకున్నట్టు కనిపించినా, చివరిలో మళ్లీ పతనం కొనసాగింది. నాన్ బ్యాంకింగ్ కంపెనీలకు నగదు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించినప్పటికీ, మదుపరులు ఆసక్తిని ప్రదర్శించకపోవడం గమనార్హం.