బిజినెస్

నాలుగు శాతం పడిపోయిన రిలయన్స్ షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: రిలయన్స్ ఇండస్ట్రీస్ (రిల్) షేర్లు శుక్రవారం నాలుగు శాతానికిపైగా పడిపోయాయి. జూలై-సెప్టెంబర్ త్రై మాసికంలో భారీ లాభాలను ఆర్జించినట్టు రిల్ ప్రకటించినప్పటికీ, దాని ప్రభావం మార్కెట్ లావాదేవీల్లో కనిపించలేదు. 4.11 శాతం పతనమైన రిల్ వాటా ధర 1,101.65 రూపాయల వద్ద ముగిసింది. ఒకానొక దశలో ఈ వాటాల ధర 1,073.15 రూపాయలకు (6.59 శాతం) పతనమైంది. కానీ, ఆతర్వాత కొంత వరకు కోలుకుంది. కానీ, నష్టాల నుంచి తప్పించుకోలేకపోయింది. ఈ పరిణామంతో రిల్ మార్కెట్ విలువ ఏకంగా 29,945 కోట్ల రూపాయలు తగ్గిపోయింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్సీ)లో శుక్రవారం లావాదేవీలు ముగిసే సమయానికి రిల్ మార్కెట్ విలువ 6,98,278.03 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ ఒక్క రోజే బీఎస్సీలో 14.61 లక్షల షేర్లు, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో రెండు కోట్లకుపైగా షేర్లు చేతులు మారాయి. ఇంత భారీగా రిల్ షేర్ల అమ్మకాలు జరగడం చాలాకాలం తర్వాత ఇదే మొదటిసారి. రిల్ షేర్ల పతనం సహజంగానే సెనె్సక్స్‌పై తీవ్ర ప్రభావం చూపింది. మిగతా అంశాలు ఎలావున్నా, రిల్ షేర్ల పతనం సెనె్సక్స్‌ను అతలాకుతలం చేసింది. నష్టాల బాటలో నడిపింది.