బిజినెస్

కార్పొరేట్ల ఆదాయాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రస్తుతం కొనసాగుతున్న కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాల వెల్లడి సీజన్ ముఖ్యంగా విప్రో, భారతి ఎయిర్‌టెల్ వంటి బ్లూచిప్ కంపెనీల ఫలితాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల ధోరణిని నిర్దేశించనున్నాయి. రూపాయి, ముడి చమురు ధరల కదలికలు వంటి కీలక అంశాలు కూడా స్టాక్ మార్కెట్ల ధోరణిని ప్రభావితం చేయనున్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, బీహెచ్‌ఈఎల్ (్భల్) కూడా వచ్చే వారంలో తమ రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. 3దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న సమస్యలు, ప్రపంచ పరిణామాలలోని ప్రతికూలతలు, రానున్న ఎన్నికలపై నెలకొన్న ఆందోళనల ఫలితంగా ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్ ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు మున్ముందు కూడా కొనసాగే అవకాశం ఉంది. 3అదే సమయంలో పైన పేర్కొన్న ప్రతికూల అంశాలను స్టాక్ మార్కెట్ ఇప్పటికే జీర్ణం చేసుకుంది. ప్రపంచ మార్కెట్‌లో పెట్టుబడులపై ఆదాయాలలో స్థిరత్వం, వాణిజ్య యుద్ధం వంటి అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయి2 అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ విభాగం అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 418 పాయింట్లు పడిపోయి, 34,315.63 పాయింట్ల వద్ద ముగిసింది.
ద్రవ్యలభ్యత సమస్యను ఎదుర్కొంటున్న బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీల) తీరును కూడా మదుపరులు పరిశీలిస్తారు. ఈ రంగం ఇప్పటికే మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసి ఉంది. వచ్చే వారం చివరలో డెరివేటివ్‌ల కాలపరిమితి ముగియనున్నందున ఈక్విటీ మార్కెట్ల లావాదేవీలలో ఊగిసలాట ధోరణి నెలకొనే అవకాశం ఉంది.