బిజినెస్

ఒడిదుడుకులకు ఆస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 27: డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగుస్తున్న క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఒడిదుడుకులకు లోనుకావచ్చన్న అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలకుగాను డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియనుంది. దీంతో మదుపరులు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించే వీలుందని అంచనా వేస్తున్నారు. గత నాలుగు వారాలుగా స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే కదలాడుతున్నది తెలిసిందే. ఇకపోతే వచ్చే నెల 5న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్ష చేయనున్న క్రమంలో మార్కెట్‌పై ఆ ప్రభావం కూడా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, టోకు ద్రవ్యోల్బణం మైనస్‌లోనే కదలాడుతుండటం, పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) గణాంకాలు పేలవంగా ఉండటం మధ్య ఆర్‌బిఐ రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మదుపరులు పెట్టుబడులకు కాస్త ఆసక్తి కనబరుస్తారన్న అభిప్రాయాలు పలువురు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు ఎప్పటిలాగే విదేశీ మదుపరుల పెట్టుబడులు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారతీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. గత వారం కేవలం మూడు రోజులే ట్రేడింగ్ జరిగినప్పటికీ సూచీలు లాభాల్లో కదలాడాయి. హోలి, గుడ్‌ఫ్రైడే సందర్భంగా గురు, శుక్రవారాలు మార్కెట్లు మూతపడ్డాయి. శని, ఆదివారాలు మార్కెట్లకు రెగ్యులర్ సెలవులు కావడంతో వరుసగా నాలుగు రోజుల సెలవుల తర్వాత సోమవారం మళ్లీ సూచీలు ట్రేడింగ్‌కు సిద్ధమవుతున్నాయ. గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 25వేల స్థాయి ఎగువన ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 7,700 స్థాయిని అధిగమించింది. మూడు రోజుల్లో సెనె్సక్స్ 384.82 పాయింట్లు పుంజుకుని 25,337.56 వద్ద ముగియగా, నిఫ్టీ 112.15 పాయింట్లు అందిపుచ్చుకుని 7,716.50 వద్ద నిలిచింది. వరుసగా నాలుగు వారాల్లో సెనె్సక్స్ 2,183.26 పాయింట్లు ఎగబాకితే, నిఫ్టీ ఈ నాలుగు వారాల్లోనే 686.75 పాయింట్లు ఎగిసింది.