బిజినెస్

రికార్డు స్థాయిలో ‘అమేజ్’ విక్రయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సీఐఎల్) మనదేశంలో విడుదల చేసిన కొత్త ‘కాంపాక్టు సెడాన్ అమేజ్’ కారు గడచిన ఐదు నెలల వ్యవధిలోనే కంపెనీకి రికార్డు స్థాయి అమ్మకాలతో అగ్రభాగాన నిలిచింది. కేవలం ఐదు నెలల్లో 50వేల అమేజ్ కార్లు అమ్ముడయ్యాయని, తమ కంపెనీ విడుదల చేసిన ఏ కార్లూ ఈ స్థాయిలో అమ్మకాలు కాలేదని సోమవారం ప్రకటనలో సంబంధిత అధికారులు పేర్కొన్నారు, ఈయేడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలం లో తమ కంపెనీ మొత్తం అమ్మకాల్లో ఈ కార్ల విక్రయాలే 50శాతానికి పైగా జరిగాయని వివరించారు. తొలిసారిగా వాహనం కొనుగోలు చేసేవారిలో 20 శాతం మందిని అమేజ్ కారు ఆకట్టుకోవడం ఆనందంగా ఉందన్నారు. టైర్‌వన్ సిటీల నుంచి 40 శాతం. టైర్-2 సిటీల నుంచి 30 శాతం వంతున మార్కెట్‌లను ఈ కారు ఆకర్షించిందన్నారు. ఈ కారులో పొందుపరిచిన అడ్వాన్స్‌డ్ సీవీటీ టెక్నాలజీ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోందన్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ ఆప్షన్లకు సంబంధించిన ఆటోమేటిక్ వేరియంట్స్ పట్ల 30 శాతం కస్టమర్లు ఆసక్తి చూపారని సెల్స్ మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ మకోటో హైయోడా తెలిపారు. భారత కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా త్వరలో సెకండ్ జనరేషన్ అమేజ్ కార్లను సైతం ఆవిష్కరించాలన్న సంక ల్పం తమ కంపెనీకి ఉందని ఆయన తెలిపారు. తొ లిసారిగా భారత్‌లోనే హోండా సరికొత్త ‘అమేజ్’ కారును ప్రవేశపెట్టిందని, అలాగే ఈ కారులోని డీ జిల్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ (సీవీటీ) సౌకర్యం సైతం తొలిసారిగా ఏర్పాటైందని తెలిపారు.