బిజినెస్

నాలుగింతలైన కొటక్ మహీంద్ర లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో నాలుగో అతిపెద్ద బ్యాంకైన కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే నాలుగింతలు పెరగడం గమనార్హం. 741.97 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో 189.78 కోట్ల రూపాయల లాభానికే బ్యాంక్ పరిమితమైంది. ఇక ఆదాయం విషయానికొస్తే ఈసారి 5,120.03 కోట్ల రూపాయలుగా ఉంది. క్రిందటిసారి 4,583.86 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు కొటక్ మహీంద్ర బ్యాంక్ గురువారం తెలియజేసింది. ఏకీకృత లాభం కూడా గతంతో చూస్తే 516.57 కోట్ల రూపాయల నుంచి 1,067.10 కోట్ల రూపాయలకు పెరిగింది. కాగా, బాండ్ల జారీ ద్వారా 5,000 కోట్ల రూపాయలను బ్యాంక్ సమీకరించనుంది.