బిజినెస్

మళ్లీ బలహీనపడిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: కార్పొరేట్ కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు మిశ్రమ ధోరణిలో ఉండటంతో పాటు అమెరికా-చైనా మధ్య వాణిజ్య వివాదాలపై చర్చలు జరుగనున్న తరుణంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు బలహీనపడ్డాయి. ముఖ్యంగా ఫైనాన్సియల్, ఎనర్జీ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 176.27 పాయింట్లు (0.52 శాతం) పడిపోయి, 33,891.13 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా 52.45 పాయింట్లు (0.51 శాతం) పడిపోయి, 10,198.40 పాయింట్ల వద్ద స్థిరపడింది. చైనా నుంచి దిగుమతి అవుతున్న ఇతర సరుకులపై వచ్చే నెలలో అమెరికా ఎలా స్పందిస్తుందోనని ప్రపంచ మార్కెట్లు నిశితంగా పరిశీలిస్తున్నాయి. దీంతో పాటు కార్పొరేట్ కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు మిశ్రమ ధోరణిలో ఉండటం దేశీయ స్టాక్ మార్కెట్లలో గత సెషన్‌లోని సానుకూల ధోరణి కొనసాగడానికి దోహదపడలేదు.
సోమవారం బీఎస్‌ఈ సెనె్సక్స్ 718 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 220 పాయింట్ల చొప్పున పుంజుకున్నాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి నెలకొన్నప్పటికీ, ప్రతికూలత వైపే మొగ్గు చూపాయి. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో ఇండెక్స్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ మంగళవారం 2.84 శాతం పడిపోయి రూ. 1,057.15కు చేరింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో వాటి ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ కంపెనీ షేర్ విలువ పడిపోవడానికి దారితీసింది. నష్టపోయిన ఇతర ప్రధాన సంస్థల్లో ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, కోల్ ఇండియా, సన్ ఫార్మా ఉన్నాయి. వీటి షేర్ల విలువ 3.5 శాతం వరకు పడిపోయింది. మరోవైపు, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, ఎస్‌బీఐ, టీసీఎస్, టాటా మోటార్స్ షేర్ల విలువ 2.48 శాతం పెరిగింది. అయితే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు పెద్ద కంపెనీల షేర్లతో పోలిస్తే రాణించాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సుమారు ఒక శాతం పుంజుకున్నాయి. చక్కెర తయారీ పరిశ్రమల షేర్ల విలువ పది శాతం వరకు పెరిగింది.
అననుకూల వర్షాలతో పాటు చెరకు పంటకు తెగుళ్ల కారణంగా ఈ మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర ఉత్పత్తి మూడు శాతం తగ్గి, 31.5 మిలియన్ టన్నులకు పడిపోతుందని ఇండస్ట్రీ బాడీ ఐఎస్‌ఎంఏ పేర్కొనడంతో చక్కెర తయారీ కంపెనీల షేర్లు రాణించాయి. ఇదిలా ఉండగా, ప్రపంచ మార్కెట్‌లో మంగళవారం చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి.