బిజినెస్

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాభం రూ. 3,239 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 21: దేశీయంగా ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో రెండో అతిపెద్ద బ్యాంకైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 20.2 శాతం పెరిగి 3,239 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో 2,695.72 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 19,322.63 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 16,502.97 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక స్థూల నిరర్థక రుణాలు 0.95 శాతం నుంచి 1.04 శాతానికి ఎగిశాయి. గణాంకాల ప్రకారం 728 కోట్ల రూపాయల నుంచి 866.7 కోట్ల రూపాయలకు చేరాయి. ఈ మేరకు గురువారం బ్యాంక్ తెలియజేసింది.