బిజినెస్

జెట్ ఎయిర్‌వేస్‌కు తాఖీదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: జెట్ ఎయిర్ వేస్ వెంటనే బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ విమానాలను లీజుకు ఇచ్చిన సంస్థలు నోటీసులు జారీ చేశారు. జెట్ ఎయిర్‌వేస్ సంస్థ నోటీసులు అందుకున్న వెంటనే లీజు దారులతో చర్చలు ప్రారంభించింది. సంస్థ ఆర్థిక సంక్షోభంలో ఉందని ఆర్థిక సమస్యలు పరిష్కారమైన వెంటనే, బకాయిలను చెల్లిస్తామని పేర్కొంది. ఈ కంపెనీ షేర్ల రేటు 5.71 శాతం మేర పడిపోయి రూ.222.30కు పడిపోయాయి. చెల్లింపులు ఆలస్యమైనందుకు, బకాయిలలు చెల్లించనందుకు లీజుదారులు నోటీసులు ఇచ్చినట్లు జెట్ ఎయిర్‌వేస్ సంస్థ యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెల్లింపులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో సిబ్బందికి, చివరకు పైలెట్లకు వేతనాలు చెల్లించలేని స్థితికి జెట్ ఎయిర్ వేస్ చేరుకుంది.