బిజినెస్

టాటా మోటార్స్ నికర నష్టాలు రూ.1009 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 31: ఈ ఏడాది రెండవ త్రైమాసిక కాలంలో టాటా మోటార్స్ రూ.1009 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. బ్రిటీష్ ఆర్మ్ జాగర్ లాండ్ రోవర్ పేలవమైన వృద్ధిరేటును సాధించింది. దీని వల్ల నష్టాలు వచ్చాయి. ఈ కంపెనీ గత ఏడాది రెండవ త్రైమాసిక కాలంలో రూ.2501.67 కోట్ల లాభాలను సాధించింది. కాగా ఈ సంస్థ రెవెన్యూ రూ.69,838.68 కోట్ల నుంచి రూ. 72,112.08 కోట్లకు పెరిగాయి. అంటే 3.3 శాతం వృద్ధిరేటు నమోదైంది. టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ ఆపరేషనల్‌గా, ఆర్థిక సామర్థ్యంలో తమ సంస్థ మంచి ప్రగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కెట్ వాటాలను మెరుగుపరుచుకుంటున్నట్లు చెప్పారు. వాణిజ్య, ప్యాసింజర్ వాహనాల తయారీలో నగదు రాబడి బాగున్నట్లు చెప్పారు. చైనాలో జాగర్ లాండ్ రోవర్ మార్కెట్ దెబ్బతిందని చెప్పారు. కాగా ఈ ఏడాది రెండవ ఆర్థిక సంవత్సరంలో మంచి ప్రగతి సాధించేందుక ప్రణాళికలను రూపొందించామాన్నరు. టాటా మోటార్స్ వాటాలు ఈ రోజు మార్కెట్‌లో రూ.178.65 పైసల వద్ద నిలిచాయి.