బిజినెస్

మంచి లాభాలను ఆర్జించనున్న ఫార్మా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 31: వర్తమాన ఆర్థిక సంవత్సరంలో రెండవ త్రైమాసిక కాలంలో ఫార్మా రంగం ఎక్కువ లాభాలను ఆర్జించే అవకాశం కనపడుతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గినా, ఫార్మా రంగం మాత్రం నిలదొక్కుకున్నట్లు ఇండియా రేటింగ్స్ సంస్థ నివేదికలో పేర్కొంది. దాదాపు గత ఏడాదితో పోల్చితే రూపాయి 9 శాతం క్షీణించింది. ఫార్మా రంగం ఇన్‌పుట్ వ్యయాన్ని పెంచింది. వీటి ఉత్పత్తి ధరలు కూడా ఒత్తిడికి గురయ్యాయి. ఫార్మా రంగంలో విపరీతమైన పోటీ పెరిగింది. రూపాయి బలహీనపడింది. ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ వత్తిళ్లను తట్టుకుని ఫార్మా రంగం లాభాల వైపు పరుగులు తీస్తోంది. ఈ ఏడాది చివరకు డాలర్‌తో పోల్చితే రూపాయి రూ.69.79కు తగ్గే అవకాశం ఉంది. దాదాపు 8.3 శాతం క్షీణిస్తుంది. దేశీయ మార్కెట్‌లో కూడా ఫార్మా రంగం ఒత్తిళ్లకు తట్టుకుని నిలబడింది. అమెరికాలో పోటీ ఉన్న మార్కెట్ సవాళ్లను అధిగమించి కూడా భారత్ ఫార్మా రంగం మనుగడ సాధించింది. ఈ ఏడాది ఫార్మా రంగం దేశీయంగా అభివృద్ధిపై దృష్టిని సారించాయి. గత ఏడాదితో పోల్చితే ఫార్మా రంగం 100 నుంచి 150 పాయింట్ల పేర పెరిగింది. 2018-19 సంవత్సరం ఫార్మా రంగం బలపడేందుకు మంచి అవకాశం ఉందని ఇండియా రేటింగ్ సంస్థ పేర్కొంది.