బిజినెస్

సెనె్సక్స్ పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: అనేకానేక అంశాలు ప్రభావితం చేయడంతో, బుధవారం బాంబే స్టాక్ ఏక్ఛ్సేంజ్‌లో లావాదేవీలు లాభాల్లో ముగిశాయి. సెనె్సక్స్ బలడి, మదుపరుల్లో కొంత కాలంగా నెలకొన్న భయాందోళనలకు తెరదించింది. ఇటీవల ఎదురైన నష్టాల ఊబి నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్లింది. ద్రవ్య లబ్ధత సమస్య నుంచి బ్యాంకింగేతర సంస్థలను బయటపడేసేందుకు ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు బుధవారం నాటి లావాదేవీలపై ప్రభావం చూపాయి. దీనితో సెనె్సక్స్ 550.92 పాయింట్లు (1.63 శాతం) పెరిగి, 34,442.05 పాయింట్ల వద్ద ముగిసింది. ఏదైనా కీలక పరిణామం లేదా ఆర్థిక సంస్థలు, ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల తర్వాత చోటు చేసుకునే పరిణామాన్ని సాంకేతిక భాషలో ‘్ఫలో త్రూ డే’గా పేర్కొంటారు. గురువారం తర్వాత ఏ రోజైనా మార్కెట్‌లో ద్రవ్య లబ్ధత పెరుగుతుందని ఇటీవల ఆర్‌బీఐ చేసిన ప్రకటన స్పష్టం చేస్తున్నది. లిక్విడిటీ సమస్య తలెత్తిన కారణంగా, ప్రభుత్వ రంగ సంస్థల్లో షేర్లను కొనుగోలు చేయడం ద్వారా 40,000 కోట్ల రూపాయలను మార్కెట్‌లోకి విడుదల చేయాలని ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపింది. ఈ ప్రకటన వెలవడిన తర్వాత, ఆర్‌బీఐ షేర్ల కొనుగోళ్లను మొదలుపెట్టనుండగా, రాబోయే మార్పులను పసిగట్టిన మదుపరులు ఉత్సాహంగా ట్రేడింగ్ జరిపారు. ఇది కొత్తగా చోటు చేసుకున్న పరిణామం కాదని, సహజంగా ఎప్పుడైనా ఒక కీలక ప్రకటన వెలువడిన తర్వాత స్టాక్ మార్కెట్‌పై దాని ప్రభావం కనిపించడం ఆనవాయితీగా మారిందని శాంక్టమ్ వెల్త్ మేనేజ్‌మెంట్ చీఫ్ ఇనె్వస్ట్‌మెంట్ ఆఫీసర్ సునీల్ శర్మ తెలిపారు. ఆయన పీటీఐతో మాట్లాడుతూ, ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య నెలకొన్న కొన్ని సమస్యలు పరిష్కారం కావడంతో, పెట్టుబడి సెంటిమెంట్ బలంగా పని చేసిందని వ్యాఖ్యానించారు. ఆర్‌బీఐ అమలు చేస్తున్న విధానాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనే సందేశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇవ్వడంతో మార్కెట్ బలపడిందని చెప్పారు.
ఆర్‌బీఐ చట్టానికి లోబడి, సెంట్రల్ బ్యాంక్‌కు అటానమీని ప్రకటించే ప్రతిపాదనకు కేంద్రం ఆమోద ముద్ర వేయడంతో, చాలా వరకు సమస్యలకు తెరపడింది. బ్యాంకింగ్, ఐటీ, పార్మా, రియాలిటీ వంటి కీలక రంగాలన్నీ ఊపందుకోవడంతో స్టాక్ మార్కెట్ కొత్త జీవం పోసుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, మహీంద్ర అండ్ మహీంద్ర వంటి కంపెనీలు లాభాలను ఆర్జించాయి. ఇలావుంటే, సెనె్సక్స్‌తోపాటు నిఫ్టీ కూడా బుధవారం లాభాల బాట పట్టింది. 188.20 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 10,386.60 పాయింట్ల వద్ద ముగిసింది. టెక్ మహీంద్ర, ఇండియాబుల్స్, యూపీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్ టెక్ వంటి కంపెనాలు లాభపడితే, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, హిందాల్‌కో, మారుతి సుజికీ వంటి సంస్థల షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి.