బిజినెస్

ఎగుమతులకు పెద్ద దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అమల్లోకి వచ్చిన ఆదేశాలు
వాషింగ్టన్, నవంబర్ 1: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సంబంధిత అంశాలలో అనుసరిస్తున్న కఠిన వైఖరి భారత్ నుంచి ఆ దేశానికి ఎగుమతి అయ్యే 50 సరుకులపై ఇప్పుడు తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికా గురువారం భారత్ నుంచి దిగుమతి అయ్యే 50 సరుకులను పన్ను రహిత సరుకుల జాబితాలోనుంచి తొలగించింది. ఇందులో ఎక్కువ మట్టుకు చేనేత, వ్యవసాయ రంగాలకు చెందిన సరుకులు ఉన్నాయి. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెనె్సస్ (జీఎస్‌పీ) కింద ఇప్పటి వరకు పన్ను రహిత జాబితాలో ఉన్న 90 సరుకులను నవంబర్ ఒకటో తేదీ నుంచి తొలగిస్తూ అమెరికా ఫెడరల్ రిజిస్టర్ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో భారత్ నుంచి దిగుమతి అవుతున్న 50 సరుకులు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం పన్ను మినహాయింపులు ఉన్న సరుకుల జాబితా నుంచి 90 సరుకులను నవంబర్ ఒకటో తేదీ నుంచి తొలగిస్తూ అధ్యక్ష సాధికార ప్రకటన విడుదల చేశారు. నవంబర్ ఒకటో తేదీనుంచి ఈ 90 సరుకులు జీఎస్‌పీ విధానం కింద పన్ను మినహాయింపునకు అర్హత కలిగి ఉండవు. అయితే, ఈ సరుకులకు ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్ డ్యూటీ-రేట్స్’ వర్తించే అవకాశం ఉందని అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్‌లోని ఒక అధికారి తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దేశం ఆధారంగా కాకుండా నిర్దిష్ట వస్తువుల ఆధారంగా సాధికార ప్రకటన విడుదల చేశారు. అయితే, జీఎస్‌పీ కింద ఇప్పటి వరకు ఎక్కువగా లబ్ధి పొందుతూ వస్తున్నది భారతదేశమే. కాబట్టి, ట్రంప్ పాలనా యంత్రాంగం తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల ఎక్కువగా నష్టపోయేది కూడా భారతదేశమే. వేలాది వస్తువులను పన్ను రహితంగా దిగుమతి చేసుకోవడం ద్వారా ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి అమెరికా ప్రవేశపెట్టిన అతి పెద్ద, అతి పురాతనమయిన వాణిజ్య ప్రాధాన్యత కార్యక్రమమే జీఎస్‌పీ. ఇప్పుడు పన్ను రహిత జాబితాలో నుంచి అమెరికా తొలగించిన 90 వస్తువులలో 50 వస్తువులు భారత్ నుంచి దిగుమతి అయితున్నవే ఉన్నాయి. జీఎస్‌పీ వల్ల అత్యధికంగా లబ్ధి పొందుతున్నది ఇండియానే. 2017లో జీఎస్‌పీ కింద భారత్ నుంచి అమెరికాకు జరిగిన పన్ను రహిత వస్తువుల ఎగుమతులు 5.6 బిలియన్ డాలర్లకన్నా ఎక్కువే. అయితే, ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల భారత్ నుంచి ఆ దేశానికి ఎగుమతులు ఎంత మొత్తంలో తగ్గిపోతాయనేది ఇప్పటి వరకు అంచనా వేయలేదు. అయితే చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలు ఈ తాజా నిర్ణయం వల్ల ప్రభావితం అవుతాయి. ప్రత్యేకించి చేనేత, వ్యవసాయ రంగాలకు చెందిన కంపెనీలపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది.