బిజినెస్

10వేల మందికి ఉద్యోగావకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 2: వచ్చే మూడు సంవత్సరాల కాలంలో, మహారాష్టల్రో సుమారు పదివేల మందికి ఉద్యోవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎంచుకున్నట్టు స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఫర్నీచర్ సంస్థ ఐకియా ప్రకటించింది. దేశంలోనే ఐకియా మొట్టమొదటి షోరూమ్‌ను హైదరాబాద్‌లో, ఆగస్టు మాసంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. నవీ ముంబయిలో త్వరలోనే స్టోర్‌ను మొదలు పెడతామని, ముందుగా 5,000 మంది ఉద్యోగులు నియమిస్తామని ఐకియా భారత ప్రజలు, సంస్కృతి విభాగం మేనేజర్ అన్నా కరిన్ మాన్సన్ పేర్కొంది. శుక్రవారం ఆమె పీటీఐతో మాట్లాడుతూ వచ్చే మూడేళ్ల కాలంలో, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పది వేల మందికి ఉద్యోగాలను కల్పిస్తామని అన్నారు. అన్ని స్థాయిల ఉద్యోగాల్లోనూ 50 శాతాన్ని మహిళలకు కేటాయిస్తామని ప్రకటించారు. సమానత్వాన్ని గౌరవిస్తామని, సమతౌల్యాన్ని కాపాడుతామని కరిన్ మాన్సన్ తెలిపారు. స్వలింగ సంపర్కులు, ట్రాన్స్ జెండర్లను కూడా ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పారు. వారి హక్కులనున పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వ్యాఖ్యానించారు. మహారాష్టల్రో మార్కెట్ ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.