బిజినెస్

మళ్లీ 35వేల స్థాయికి సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఫైనాన్సియల్, వాహన రంగాల షేర్లు రాణించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం బలపడ్డాయి. ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడంతో పాటు రూపాయి బలపడటం, విదేశీ ఇనె్వస్టర్లు తాజా కొనుగోళ్లకు పూనుకోవడం ఈ రెండు రంగాల షేర్ల ధరలు పుంజుకోవడానికి దోహదపడింది. దీంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 580 పాయింట్లు పుంజుకొని నెల రోజుల గరిష్ఠ స్థాయి 35,011.65 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా 172.55 పాయింట్లు పెరిగి, 10,553 పాయింట్ల వద్ద స్థిరపడింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ ఆందోళనలు తగ్గిన కారణంగా ఇతర ఆసియా దేశాలలోని చాలా మట్టుకు మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పాటు యూరోపియన్ మార్కెట్లు సానుకూల ధోరణిలో ప్రారంభం కావడం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొనడానికి తోడ్పడిందని బ్రోకర్లు చెప్పారు. బీఎస్‌ఈ సెనె్సక్స్ శుక్రవారం ఉదయం పటిష్టమయిన స్థాయి 34,743.95 పాయింట్ల వద్ద ప్రారంభమయింది. తరువాత మరింత ముందుకు సాగుతూ కీలకమయిన 35,000 స్థాయిని అధిగమించి, 35,190.20 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, తరువాత మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల అంతకు ముందు ఆర్జించిన లాభాలు కొంత తగ్గాయి. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 579.68 పాయింట్ల (1.68 శాతం) ఎగువన 35,011.65 పాయింట్ల వద్ద ముగిసింది. అక్టోబర్ 4వ తేదీ తరువాత సెనె్సక్స్ ఇంత అధిక స్థాయి వద్ద ముగియడం ఇదే మొదటిసారి. అక్టోబర్ 4న ఈ సూచీ 35,169.16 పాయింట్ల వద్ద ముగిసింది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 172.55 పాయింట్లు (1.66 శాతం) పుంజుకొని, 10,553 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతకు ముందు ఈ సూచీ ఇంట్రా-డేలో 10,606.95 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, వారం రీత్యా చూస్తే ఈ రెండు కీలక సూచీలు గత రెండు వారాల నష్టాలకు తెరదించాయి. ఈ వారంలో సెనె్సక్స్ 1,662.34 పాయింట్లు (అయిదు శాతం), నిఫ్టీ 523 పాయింట్ల (అయిదు శాతం) చొప్పున పుంజుకున్నాయి.
ఇదిలా ఉండగా, కొన్ని కం పెనీలు అక్టోబర్ నెలలో విక్రయించిన వాహనాల గణాంకా లు ప్రోత్సాహకరంగా ఉండటంతో శుక్రవారం వాహన రంగ షేర్లు రాణించాయి. గత కొంత కాలంగా భారత స్టాక్ మార్కెట్ల లో తమ వద్ద ఉన్న షేర్లను అ మ్ముకుంటూ వస్తున్న విదేశీ సం స్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐ లు) తాజాగా గురువారం నికరంగా రూ. 348.75 కోట్ల విలు వ గల షేర్లను కొనుగోలు చేశారు. మరోవైపు, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 509.17 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. ఇదిలా ఉండగా, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్ ఈ దీపావళిని పురస్కరించుకొని ఈ నెల 7 (బు ధవారం)నాడు స్పెషల్ ‘ముహురత్’ ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహించనున్నాయి. ప్రతి సంవత్స రం పవిత్ర దినమయిన దీపావళి రోజు ఈ ప్ర త్యేక ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తుంటాయి. సా యంత్రం అయిదు గంటల నుంచి 6.30 గంటల వరకు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ ఉంటుందని ఈ రెండు స్టాక్ ఎక్స్చేంజీలు తెలిపాయి.