బిజినెస్

పరుగులెత్తిన బుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 3: గత వారం కుంటుపడిన బుల్ రన్ ఈవారం కోలుకోవడమేగాక, దూకుడును పెంచింది. అన్ని విధాలా మెరుగైన వాతావరణం కొనసాగడంతో బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో లావాదేవీలు దాదాపుగా స్థిర ఫలితాలనిచ్చాయి. మార్కెట్ కుదుటపడంతో, సెనె్సక్స్ చాలాకాలం తర్వాత మళ్లీ 35,000 పాయింట్ల సూచీని అధిగమించింది. గత నెల 26వ తేదీన సెనె్సక్స్ 33,349.31 పాయింట్ల వద్ద ముగిసింది. దీనితో ఈవారం పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, శని, ఆదివారాల సెలవు తర్వాత, సోమవారం వేగాన్ని పుంజుకున్న స్టాక్ మార్కెట్ 34,067.40 పాయింట్ల వద్ద ముగిసింది. మంగళవారం కొద్దిగా తగ్గి, 33,869.13 పాయింట్లుగా నమోదైంది. అయితే, ఈ తగ్గుదల చాలా స్వల్పం కావడం వల్ల మార్కెట్ కుదేలయ్యే పరిస్థితి తలెత్తలేదు. బుధవారం మళ్లీ కోలుకొని, 34,442.05 పాయింట్లకు ఎదిగింది. గురువారం అతి స్వల్పంగా, అంటే 10.08 పాయింట్లు నష్టపోయి, 32,370.04 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఈవారం లావాదేవీలకు చివరివారమైన శుక్రవారం స్టాక్ మార్కెట్‌లో బుల్ రంకె వేసింది. 579.68 పాయింట్లు జంప్ చేసి, 35,011.65 పాయింట్లకు చేరింది. నష్టాలు, ఒడిదుడుకుల నుంచి బయటపడిన స్టాక్ మార్కెట్ సూచీ మరోసారి 35,000 పాయింట్లను అధిగమించింది. మొత్తం మీద ఈవారంలో సెనె్సక్స్ 1,662.34 పాయింట్లు పెరగడం విశేషం. విదేశీ పెట్టుబడిదారులు వాటాల అమ్మకానికి మొగ్గుచూపినప్పటికీ, దేశీయ మదుపరులు ఆసక్తిని ప్రదర్శించడంతో మార్కెట్ కుప్పకూలకుండా నిలవడమేగాక, మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా ముందుకు దూసుకెళ్లింది. ఈ ఒరవడి వచ్చే వారం కూడా కొనసాగుతుందని విశే్లషకుల అంచనా.