బిజినెస్

రక్షణ రంగ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 3: రక్షణ రంగ ఉత్పత్తుల్లో దేశం స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) చైర్మన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం కార్యదర్శి డాక్టర్ జీ సతీష్ రెడ్డి అన్నారు. విశాఖలోని నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేబొరేటరీ (ఎన్‌ఎస్‌టీఎల్) 49వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకూ కేవలం 60 శాతం మాత్రమే రక్షణ పరికరాలను దేశీయంగా ఉత్పత్తి చేసుకుంటున్నామన్నారు. రక్షణ రంగ పరికరాల కోసం ఇప్పటికీ భారత్ ఇతర దేశాలపై ఆధారపడుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే రక్షణ రంగ పరికరాల ఉత్పత్తులకు సంబంధించి పెద్ద ఎత్తున స్టార్టప్‌లను ప్రోత్సహించాల్సి ఉందన్నారు. రక్షణ రంగంలో పరిశోధనలు, అభివృద్ధి, ఉత్పత్తులకు సంబంధించి చిన్న తరహా స్టార్టప్‌లతో మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. దేశ రక్షణకు సంబంధించి రక్షణ రంగ ఉత్పత్తులను స్వదేశంగా అభివృద్ధి చేసుకునేందుకు విశేషంగా కృషి చేస్తోందన్నారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు వీలుగా పెద్ద ఎత్తున యువతను సమీకరించాల్సి ఉందన్నారు. రక్షణ రంగానికి అవసరమైన ఉత్పత్తులపై పరిశోధనలు, అభివృద్ధి వంటి అంశాల్లో వీరికి సరైన దిశానిర్ధేశం చేయాల్సి ఉందన్నారు. ఇటువంటి స్టార్టప్‌లను ప్రోత్సహించడం, సాంకేతిక, ఆర్థిక సాయంతో పాటు వాటి పరీక్షలకు అసరమైన సహకారం అందించాల్సి ఉందన్నారు. అప్పుడే రక్షణ రంగ ఉత్పత్తుల్లో సుస్థిరత సాధ్యమవుతుందన్నారు. స్టార్టప్‌లను ప్రోత్సహించడం ద్వారా వచ్చే పదేళ్ల కాలంలో భారత్ రక్షణ రంగం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. రక్షణ రంగ ఉత్పత్తులను ప్రోత్సహించే క్రమంలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమని, అప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. మరుగున పడిన పరిశోధనలు, వనరుల సద్వినియోగం, సునాయాస ఉత్పాదన వంటి అంశాల్లో మరింత సమర్ధత సాధించేందుకు డీఆర్‌డీవో కృషి చేస్తోందన్నారు. దీనిలో భాగంగానే యువతను పెద్ద ఎత్తున స్టార్టప్‌ల ఏర్పాటులో ప్రోత్సహించడంతో పాటు అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పిస్తోందన్నారు.