బిజినెస్

పసిడికి రికార్డు ధర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఈవారం బంగారం రికార్డు ధర పలికింది. పండుగల సీజన్ కావడంతో దేశీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు ఒక కారణం. రూపాయి మారకపు విలువ తగ్గడంతో, ఇతరత్రా పెట్టుబడుల కంటే, బంగారం కొనడం మేలన్న ఆలోచన కూడా పది గ్రాముల బంగారం ధర గత ఆరేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా, 32,780 రూపాయలకు చేరింది. దీపావళికి ముందు బంరాన్ని కొనడం హిందూ సంప్రదాయంలో ఒక ఆనవాయితీ. పసిడి ధర పెరుగుదలకు దోహదం చేసిన అంశాల్లో ఇది కూడా ఉంది. ఈవారం ఒకానొక దశలో రికార్డు ధర పలికిన బంగారం, శనివారం 32,650 రూపాయల వద్ద ముగిసింది. శుక్రవారం 32,630 రూపాయల వద్ద ముగిసిన బంగారం ధర 20 రూపాయలు పెరిగింది. గత నెల 27న 32,550 రూపాయలుగా ఉన్న రేటు, ఈవారం మొదటిరోజైన 29న 32,620 రూపాయలకు చేరింది. 30న 32,650 రూపాయలకు పెరిగింది. నెల చివరి రోజైన 31న బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. ఈనెల ఒకటో తేదీన ఒక్కసారిగా పెరిగిన డిమాండ్‌తో పది గ్రాముల బంగారం ఏకంగా 32,780 రూపాయలకు ఎగబాకి, గత ఆరేళ్ల కాలంలో ఎన్నడూ లేని ధరతో రికార్డు నెలకొల్పింది. అయితే, రెండో తేదీ, శుక్రవారం కొంత పతనమై, 32,630 రూపాయలకు చేరింది. శనివారం 20 రూపాయలు బలపడడంతో, 32,650 రూపాయల వద్ద ముగిసింది.
బంగారం ధర దాదాపుగా పెరుగుతూనే వస్తే, అందుకు భిన్నంగా వెండి ఆటుపోట్లకు గురైంది. నిలకడలేకుండా హెచ్చుతగ్గులతో మార్కెట్ ట్రెండ్‌ను అంచనా వేయడానికి వీల్లేని పరిస్థితులను సృష్టించింది. కిలో వెండి ధర గత నెల 27న 35,600 రూపాయలుగా నమోదైంది. ఈవారం అదే ఉత్సాహంతో లావాదేవీలు జరుగుతాయని, వెండి రేటు కూడా బంగారంతో పోటీపడుతూ పెరుగుతుందని విశే్లషకులు అంచనా వేశారు. కానీ, ఈవారం ఆరంభం నుంచే పతనమవుతూ వచ్చిన వెండిధర గురువారం రోజున కనిష్టంగా 39,110 రూపాయలకు పడిపోయింది. అయితే, శుక్రవారం కొంత మెరుగుపడి, 39,500 వరకూ చేరింది. శనివారం మరో 30 రూపాయలు జత కలవడంతో కిలో వెండి ధర 39,530 రూపాయలకు చేరింది.