బిజినెస్

మరో 21 పైసలు తగ్గిన పెట్రోలు ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 4: చాలాకాలంగా పెరుగుతూ వస్తున్న పెట్రోలు, డీజిల్ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. లీటర్ పెట్రోలుపై తాజాగా 21 పైసలు తగ్గింది. దీనితో గత 18 రోజుల్లో పెట్రోలు 4.05 రూపాయల వరకూ తగ్గింది. వసూలు చేస్తున్న సుంకాల్లో 1.50 రూపాయలు తగ్గించిన కేంద్రం, మరో రూపాయిన్నర వరకూ తగ్గించాల్సిందిగా వివిధ చమురు సరఫరా కంపెనీలకు సూచించిన విషయం తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయం, చేసిన సూచన ఆరంభంలో పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ, క్రమంగా పెట్రోలు ధరలు తగ్గడం మొదలుపెట్టిన తర్వాత దాని ఫలితం కనిపిస్తున్నది. 18 రోజుల వ్యవధిలో నాలుగు రూపాయలకుపైగా ధర తగ్గడం అనేది ఆషామాషి విషయం కాదని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పెట్రోల్ మాదిరిగానే డీజిల్ ధర కూడా తగ్గుతున్నది. ఆదివారం 21 పైసలు తగ్గడంతో, 18 రోజుల్లో ఈతగ్గుదల 2.33 రూపాయలుగా నమోదైంది. ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర ప్రస్తుతం 78.78 రూపయలుకాగా, డీజిల్ ధర 73.36 రూపాయలు. అదే విధంగా ముంబయిలో పెట్రోలు 82.28, డీజిల్ 76.88 రూపాయల ధర పలుకుతున్నది. గత నెల 18వ తేదీ తర్వాత పెట్రో ధరలు తగ్గడం మొదలైంది. ఒకానొక దశలో, లీటర్ పెట్రోలు ఢిల్లీలో 84 రూపాయలు, ముంబయిలో 91.34 రూపాయలు కావడంతో, వంద రూపాయలకు చేరుతుందనే అనుమానాలు తలెత్తాయి. ఆగస్టు 16వ తేదీన ఈ భారీ ధర నమోదుకాగా, అదే సమయంలో లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో 68.72 రూపాయలు, ముంబయిలో 84.58 రూపాయలుగా ఉండింది. కాగా, ఆగస్టు 16 నుంచి అక్టోబర్ 4వ తేదీ మధ్యకాలంలో పెట్రోలు 6.86 రూపాయలు, డీజిల్ 6.73 రూపాయలు చొప్పున పెరిగింది. ఈ పెరుగుద పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తం కావడంతో కేంద్రం రంగంలోకి దిగింది. పెట్రోల్, డీజిల్‌పై 1.50 రూపాయలు చొప్పున సుంకాన్ని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. అదే విధంగా రూపాయి వరకు సబ్సిడీని భరించేందుకు అంగీకరించింది.
ఆతర్వాత క్రమంగా పెట్రోలు, డీజిల్ ధర తగ్గడం మొదలైంది. ఆరంభంలో అనుకున్నంతగా తగ్గుదల కనిపించక పోయినప్పటికీ, ఆతర్వాత దాని ఫలితం కొట్టొచ్చినట్టు కనిపించింది. మొత్తం మీద గత పద్దెనిమి రోజుల్లో సుమారు నాలుగు రూపాయల మేర ధర తగ్గడం పెట్రోలు వాడకందారులకు ఊరటనిచ్చింది. ఈ తగ్గుదల మరికొంత కాలం ఇదే రీతిలో కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.