బిజినెస్

జల రవాణాకు భారీ డిమాండ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత దేశంలో జల రవాణాకు భారీ డిమాండ్ ఉంటుందన్న వాదన బలంగా వినిపిస్తున్నది. దేశీయంగా సరకు రవాణాకు మన దేశంలో జల వనరులను గతంలో ఎన్నడూ వినియోగించలేదు. తొలిసారి సరకును తీసుకొని కోల్‌కతా నుంచి బయలుదేరనున్న ఎంవీ ఆర్‌ఎన్ టాగోర్ నౌక ఈనెల 12న వారణాని చేరుకుంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆ అరుదైన దృశ్యాన్ని వీక్షించనున్నారు. విదేశాలకు ఎగుమతులు చేయడాన్ని మినహాయిస్తే, స్వదేశంలో భారత్ ఎన్నడూ నదులు, నాదలు లేదా కాలువలను వినియోగించుకోలేదు. అతి తక్కువగా, కొన్ని ప్రాంతాల్లో పౌర రవాణాగా జల మార్గాలను ఉపయోగిస్తున్నారు. అయితే, కేవలం సరకు రవాణా కోసం ఈ మార్గాన్ని వినయోగించలేదు. మొదటి సరకు రవాణా నౌక వారణాసి చేరడంతో, దేశంలో జల మార్గాల ద్వారా రవాణాకు డిమాండ్ పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. పవిత్ర గంగానదిలో కోల్‌కతా నుంచి వారణాసి చేరుకోనున్న ‘ఎంవీ ఆర్‌ఎన్ టాగోర్’ను స్వాగతించడానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలావుంటే, గంగానదిలో ఎన్‌డబ్ల్యూ-1 (జేఎంవీపీ ఆధ్వర్యంలో హాల్దియా నుంచి వారణాసి వరకు 1,390 కిలోమీటర్లు) జల మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నది. ఇందుకుగాను 5,369 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. నౌకలో 1,500 నుంచి 2,000 మెట్రిక్ టన్నుల బరువైన సామాన్లను రవాణా చేసే అవకాశం ఉంటుంది. గంగతోపాటు ఇతర నదులను కూడా జల మార్గాలకు సంసిద్ధం చేయాలన్నది ప్రభుత్వ యోచన. తక్కువ సమయంలో భారీ కంటైనర్లను ఒక చోటు నుంచి మరో చోటుకు పంపే అవకాశం జల మార్గాల్లో ఉంటుంది కాబట్టి, డిమాండ్ విపరీతంగా పెరుగుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.